విజయవాడ

పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేసిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 12: పోలవరంపై లెక్కలు తేల్చుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయవద్దంటూ ఇతరులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శలు చేయడం శోచనీయమని, అసలు పోలవరంపై రాజకీయం చేసిందెవరో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక కాగా తమ హయాంలో 5,500 కోట్లు ఖర్చు చేసి వివిధ పనులను చేపట్టినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముంపు మండలాలను కలుపుతూ ఆర్డినెన్స్ జారీ, 2013 భూ సేకరణ చట్టం తో నిర్వాసితులకు న్యాయం చేయాలనుకోగా, ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ 3సార్లు ఆర్డినెన్స్ ద్వారా సవరణలు చేయాలనుకోవడం బీజీపీ కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పోలవరంపై చేయాల్సిన పనులన్నీ చేయగా ఇప్పుడు టీడీపీ, బీజేపీలు అంచనాల వ్యయం లెక్కలు, కమీషన్ల గురించి తేలటంలేదని ఎద్దేవా చేశారు. 4ఏళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు ఏమి చేస్తున్నారని, ఈరోజు గడ్కరీ, చంద్రబాబులు కూర్చోని లెక్కలు తేలుస్తారాని ప్రశ్నించిన రఘువీరారెడ్డి రాజకీయం లేదంటూనే రాజకీయాలు చేస్తున్న వైనం గర్హనీయమని రఘువీరారెడ్డి ఖండించారు.

ఎన్టీఆర్ కాంప్లెక్సులో మెరుగైన వసతులు
* ప్రణాళికకు కమిషనర్ ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), జూలై 12: నగరంలోని ముఖ్య వ్యాపార కూడలిగా ఉన్న ఏఎంసీ కాంప్లెక్సును ఆధునీకరించడంతోపాటు ఎన్‌టీఆర్ కాంప్లెక్సులో మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా నివాస్ ఎన్‌టీఆర్, ఏఎంసీ కాంప్లెక్సులను పరిశీలించిన ఆయన తొలుత ఏఎంసీ కాంప్లెక్సులో మొదటి, రెండో అంతస్థులను షాపింగ్ కాంప్లెక్సులకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటుచేయాలని సూచించారు. కాంప్లెక్సులో గల అనేక అనధికార ఆక్రమణలను గుర్తించి తక్షణమే తొలగించాలని తెలిపారు. తదుపరి ఎన్‌టీఆర్ కాంప్లెక్సు పార్కింగ్ సెల్లార్‌ను పరిశీలించిన నివాస్ సెల్లార్‌లో నిరుపయోగ డెబ్రీష్, చెత్త చెదారం పడవేయడాన్ని గుర్తించిన ఆయన తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సెల్లార్‌లో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కింగ్ ప్రకారం పార్కింగ్, మెరుగైన లైటింగ్, టాయిలెట్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపిన ఆయన మొదటి అంతస్థులో కూడా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఈ పర్యటనలో వీఎంసీ ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఐఆర్‌ఆర్‌కు భూములపై రైతుల్లో మిశ్రమ స్పందన
* ముసాయిదాపై హియరింగ్ కమిటీ సమావేశం
విజయవాడ (కార్పొరేషన్), జూలై 12: రాజధాని అమరావతి పరిధిలో ప్రతిపాదించిన అంతర వలయ రహదారి (ఇన్నర్‌రింగ్ రోడ్డు) నిర్మాణానికి భూములిచ్చే విషయంలో రైతులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. గతంలో చేపట్టిన భూ సమీకరణ పథకాన్ని అమలుచేస్తే తమకు అభ్యంతరం లేదని కొందరు తెలుపగా, మరికొందరు తమ భూములిచ్చేందుకు నిరాకరించారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ముసాయిదా ప్రణాళికపై గతంలో అభ్యంతరాలు, సూచనలు అందజేసిన ప్రభావిత రైతుల వాదనలను వినేందుకు హియరింగ్ కమిటీ సమావేశంలో రైతులు తమ వాదనలను వినిపించారు. తొలుత ఈ సమావేశంలో తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాలకు చెందిన గ్రామాల వారితో రెండు విడతలుగా సమావేశం నిర్వహించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అభ్యంతరం లేదు కానీ, రాజధాని నగర పరిధిలో అమలుచేసిన భూ సమీకరణ పథకం తమకు అమలుచేయాలని పలువురు రైతులు కోరారు. మరికొందరు ఎట్టి పరిస్థితిలోనూ తాము భూములిచ్చేది లేదని స్పష్టం చేశారు. అలాగే మార్కెట్ రేటుకు రెండింతల పరిహారం ఇవ్వాలని, అప్రూవ్డ్ లేఅవుట్‌లో ప్రతిపాదించిన రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. తమ భూములు ఎక్కువ విలువైనందున ప్రత్యేకంగా అదనపు పరిహారం అందజేయాలన్నారు. కేపిటల్ సిటీ ప్రతిపాదిత రహదారులను డొంక రోడ్లను వినియోగించుకుంటూ ఐఆర్‌ఆర్ రీ అలైన్‌మెంట్ చేయాలని మరికొందరు రైతులు కోరారు. పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం, కంతేరు, తాడికొండ, మోతడక, తుమ్మపూడి, చిన్న కాకాని, పెద్ద వడ్లపూడి, చిన్నవడ్లపూడి, రామచంద్రాపురం, నిడమర్రు గ్రామాల రైతులతోపాటు సీఆర్‌డీఏ ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్ అండ్ బి అధికారులు పలువురు పాల్గొన్నారు.