విజయవాడ

దేశంలో తొలి స్మార్ట్ సిటీగా విజయవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: విజయవాడను దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటానికి అనేక నూతన అధునాతన ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్మార్ట్ విజయవాడలో భాగంగా స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గోల్డెన్ మైల్ ప్రాజెక్టు ఏర్పాటును జిల్లా కలెక్టర్ బాబు ఎ శుక్రవారం పరీక్షించారు. ఈ సందర్భంగా బాబు ఎ మాట్లాడుతూ విజయవాడ పట్టణం నూతన రాజధాని అమరావతిలో భాగమైందని, విజయవాడ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పట్టణంలో సాంకేతికత ఆధారంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద సిసి కెమెరాలు, సెన్సార్‌లు ఏర్పాటు చేయటం ద్వారా నగర ప్రజలు నగరంలో ట్రాఫిక్, వాతావరణ సమాచారం, హ్యుమిడిటి, ఉష్ణోగ్రత, లొకేషన్ వంటి సమాచారం ప్రజలు తెలుసుకోగలుగుతారన్నారు. పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వీడియో సర్వైవలెన్స్ ఆపరేషన్ ద్వారా సమాచారం తెలుసుకోవటమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్యాక్సెస్, థియేటర్స్ సమాచారం తెలుసకోగలుగుతారన్నారు. అత్యవసర పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సంప్రదించే సదుపాయం ఉందన్నారు. తద్వారా పట్టణంలో చోటు చేసుకున్న సంఘటనను తెలుసుకోవచ్చన్నారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టును కలెక్టర్ ఆపరేట్ చేసి పరిశీలించారు. 110 సిసి కెమెరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని అమర్చటంలో చోటు చేసుకున్న జాప్యం గురించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిస్‌కో కంపెనీ సిసి కెమెరాలను దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్, ప్రకాశం బ్యారేజీపైన అమర్చాలని ఆదేశించారు. సిస్టంలో బెంజిసర్కిల్ సిటీ సర్క్యూట్ అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు పూర్తి పనులు నాలుగు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం పివిపి మాల్‌లో ఏర్పాటు చేసిన సిస్టంను కలెక్టర్ పరశీలించారు. పివిపి మాల్‌లో ఉన్న సిస్టంను వెంటనే మూడవ ఫ్లోర్‌లో ఉన్న కాఫీ షాప్ వద్దకు మార్చాలని ఆదేశించారు. ఈ మేరకు పివిపి మాల్ మేనేజర్‌తో కలెక్టర్ చర్చించి శుక్రవారం రాత్రికే మార్పులు జరగాలని ఆదేశించారు. అనంతరం సిఆర్ రావు మార్గంలో పార్కింగ్ వివరాలను తెలుసుకోవటానికి వీలుగా ఏర్పాటు చేసిన డివైస్‌లను, సెన్సార్‌లను కలెక్టర్ పరిశీలించారు. కేబుల్ సరిగా అమర్చలేదని దానిని క్రమపద్ధతిలో సక్రమంగా అమర్చాలని కలెక్టర్ చెప్పారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిడిఓ ఆర్‌కె అనంతకృష్ణన్, ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో