కృష్ణ

బోడెపై వైఎస్‌ఆర్ సిపి లాయర్ల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూలై 14: ఒక మహిళా ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి శనివారం ఆరోపించారు. మండలంలోని గోసాలలో ఈ నెల 9న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజాపై చేసిన వ్యాఖ్యలకు రోజా తరఫు న్యాయవాదులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసినట్లు కాపీ ఇవ్వమని లాయర్లు అడగ్గా సిఐ దామోదర్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో లాయర్లకు, సిఐకి వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారులను సంప్రదించి కేసు నమోదు చేస్తానని, విచారించకుండా రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వడం జరగదని దామోదర్ కరాఖండిగా చెప్పారు. దాంతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, న్యాయవాదులు ధర్నా ప్రారంభించారు. దీంతో సిఐ పై అధికారులతో మాట్లాడి ఫిర్యాదు అందుకున్నట్లు రశీదు ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా తరఫు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. ప్రతి విషయం సీఎం కనుసైగలతో నడుస్తోందన్నారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసి సభ్య సమాజం తలదించుకుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎదురు చూస్తుంటే స్టేషన్‌లో ఎస్‌ఐ కాని, సిఐ కాని పత్తా లేకుండా పోయారన్నారు. రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీద ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేకు న్యాయం జరగకుంటే లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి, బొప్పన భవకుమార్, తాతినేని పద్మావతి, కైలా అనిల్‌కుమార్, జ్ఞానమణి, కె.శ్రీనివాసరావు, బండి నాంచారయ్య, వి.ఆంజనేయులు, కె.వెంకటరత్నం, కె.శ్రీనివాసరావు, వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రధాన పార్కుకు స్పెషల్ జ్యూరీ అవార్డు
సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్మన్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 14: పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా పట్టణ ప్రధాన మున్సిపల్ పార్కు స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకుంది. ఈ మేరకు శనివారం నూజివీడులో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ అవార్డును అందుకున్నారు. ఏపీ గ్రీన్-2017 సంవత్సరానికి గాను ఈ అవార్డు లభించినట్లు చైర్మన్ తెలిపారు. మాకర్ల వెంకట స్వామి నాయుడు మున్సిపల్ పార్కులో పచ్చదనాన్ని పెంపొందించటంతో పాటు పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించడంలో పురపాలక సంఘం విజయం సాధించింది. పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకునే విధంగా పార్కును తీర్చిదిద్దారు. దీంతో వనం-మనం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘ పార్కులకు లభించిన అవార్డుల్లో పట్టణ ప్రధాన పార్కు కూడా ఉండటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

విపక్ష పార్టీలు బహిరంగ
చర్చకు రావాలి : గనే్న
విజయవాడ (క్రైం), జూలై 14: ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వైసీపీ, బిజెపి, జనసేన పార్టీ నేతలు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గనే్న ప్రసాద్ సవాల్ విసిరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గత నాలుగేల్ళుగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతుంటే అసత్య ఆరోపణలు చేస్తున్న ఆయా పార్టీల నేతలు ప్రజలను తప్పు దారి పట్టించే రీతిలో వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. చౌకబారు రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ కుట్ర రాజకీయాలు చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే వారే తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.