విజయవాడ

సీఆర్‌డీఏ పరిధిలో నిర్మిత భవనాల ప్లాన్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 17: అనధికార, అక్రమ నిర్మాణాలను నియంత్రించే చర్యల్లో భాగంగా సీఆర్‌డీఏ సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. సీఆర్‌డీఏ పరిధిలోని ప్రాంతాల్లో జరిగే ప్రతి నిర్మిత భవనం వద్దకు వెళ్లి పరిశీలించే ప్రక్రియ చేపట్టిన అధికారులు మంగళవారం యనమలకుదురులోని పలు భవనాలను పరిశీలించారు. నిర్మించే భవనానికి మంజూరైన ప్లాన్, దాని ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయా, లేదా అనే అంశంతో పాటు అనధికార నిర్మాణాలపై తనిఖీలు చేపట్టారు. ఈ పరిశీలనలో 18 నిర్మిత భవనాలను పరిశీలించగా వీటిలో 2 నిర్మాణాలకు అనుమతులు లేవని, మరొక భవనంలో అదనంగా 3వ ఫ్లోర్, మరో భవనం బేస్‌మెంట్ లెవల్ పనులను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని, అనుమతి లేకుండా లేఅవుట్లు వేసినా, నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని సీఆర్‌డీఏ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి తెలిపారు. ప్లాన్ల పరిశీలన చర్యల్లో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గుమ్మడి ప్రసాదరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలేఖ, కరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

ముందుజాగ్రత్త చర్యలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్షీకాంతం

విజయవాడ, జూలై 17: రహదారి భద్రత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. నగరంలో క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన రహదారి భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షతన వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సమీక్షించారు. జిల్లాలో ప్రతినెలా క్రమం తప్పకుండా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఇతర జిల్లాలు కూడా కృష్ణాను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పలుమార్లు సూచించారన్నారు. 2017 జూన్ నెల వరకూ జిల్లాలో 1413 యాక్సిడెంట్లు జరగ్గా 412 మంది మృత్యువాత పడ్డారని, అదే 2018 జూన్ నెల వరకూ 1365 యాక్సిడెంట్లు జరిగి 326 మంది మరణించారని తెలిపారు. ఈ శాతం మైనస్ 20.87గా నమోదయిందని విశే్లషించారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సంబంధిత శాఖలు సమష్టిగా అమలుపరుస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాయన్నారు. విజయవాడ నగరంలో 2017 జూన్ నెలలో 222 ప్రమాదాలు జరిగి 67 మరణాలు సంభవించగా, 2018 జూన్ నెలలో 229 యాక్సిడెంట్లు, 37 మరణాలతో మైనస్ 44.78గా నమోదయందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జె నివాస్, డీటీసీ ఇ మీరాప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎం పీవీ రామారావు, అదనపు డీసీపీలు నాగరాజు, ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.