విజయవాడ

పశ్చిమ సమస్యలపై కార్పొరేటర్ల విన్నపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 20: డివిజన్ అంతర్గత సమస్యల పరిష్కారానికి అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాలు విన్నపాలకే సరిపోతున్నాయని, పరిష్కరిస్తామంటూ తలూపుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించడం లేదంటూ పలువురు కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు మేయర్ కోనేరు శ్రీ్ధర్ నేతృత్వంలో సర్కిల్స్ వారీగా నిర్వహించనున్న అధికార, ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశం శుక్రవారం కౌన్సిల్ హాల్లో సర్కిల్ -1 పరిధిలోని పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లతో నిర్వహించారు. వివిధ విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, చిన్న చిన్న సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించలేకపోవడం, అట్టహాసంగా శంకుస్థాపనలు చేసిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో ఆయా పనులు చేపట్టకపోవడంతో డివిజన్ ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నామంటూ దాదాపు అందరు పశ్చిమ కార్పొరేటర్లందరూ ఒకే రీతిన అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే రూ.460 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు అవలంభిస్తున్న నిర్లక్ష్యంతో ఉత్పన్నమవుతున్న ఇబ్బందులపై ఏకరువు పెట్టిన వైనం స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనితీరుకు అద్దం పడుతుండగా ఒక దశలో నేను కూడా ఏమి చేయలేనంటూ మేయర్ కోనేరు శ్రీ్ధర్ అసహనం వ్యక్తం చేయడం కార్పొరేటర్లను విస్మయం కలిగించింది.
25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ రూ.25లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీహాల్ పనులు నత్తనడకగా సాగుతున్నాయని, తమ ప్రాంతంలో 3,4 దశాబ్ధాల క్రితం ఏర్పాటుచేసిన వాటర్ పైప్‌లైన్లు వలన ఎక్కువగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, నూతన పైప్‌లైన్లను ఏర్పాటుచేయాలని కోరారు. 27వ డివిజన్ కార్పొరేటర్ హబీబుల్లా మాట్లాడుతూ లారీ స్టాండ్ ప్రాంతంలో నిర్మించిన డ్రైనేజీతో స్థానిక షాపులు వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, కరకట్ట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మించాలని, హైవే రోడ్డును కలిపే రోడ్డుకు కల్వర్టు ఏర్పాటు చేయాలన్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య మాట్లాడుతూ దర్గా ప్లాట్ల ఏరియాలలో మంచినీటి సరఫరా కావడం లేదన్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సైడ్ కాల్వలో కలపడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డివిజన్ అవసరాలకు సరిపడా శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో అపరిశుభ్రత తాండవిస్తున్న నేపథ్యంలో సరిపడా శానిటేషన్ సిబ్బందిని నియమించడమే కాకుండా స్వీపింగ్ మిషన్లను తన డివిజన్‌కు కేటాయించాలన్నారు. 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ మాట్లాడుతూ ఖుద్ధూస్ నగర్ ఏరియాలో జిమ్‌ను ఏర్పాటుచేయాలని, 4ఏళ్లుగా కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఇవ్వాల్సిన కుట్టుమిషన్లకు ఇవ్వడం లేదని, పాడైపోయిన వీధి దీపాలను తక్షణమే రీప్లేస్‌మెంట్ చేయాలని కోరారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, 39వ డివిజన్ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి, టీడీపీ కార్పొరేటర్లు సుకాశీ సరిత, అల్లు జయలక్ష్మీ, నాగోతి నాగమణి, కొరకాని అనూరాధ, గుర్రం కనకదుర్గ, పైడిమాల సుభాషిణి, సీపీఎం కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మీ, వైసీపీ కార్పొరేటర్లు టీ జమల పూర్ణమ్మ, షేక్ బీజాన్‌బీ, బత్తిపాటి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

టార్గెట్ ప్రకారం రుణాలివ్వాలి
విజయవాడ (కార్పొరేషన్), జూలై 20: వివిధ కార్పొరేషన్ల కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారు ల టార్గెట్ ప్రకారం బ్యాంకర్లు రుణాలివ్వాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వీఎంసీ కౌ న్సిల్ హాల్లో నగరంలోని వివిధ బ్యాం కర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016-17, 2017-18 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఎంబీసీ, వైశ్య, కాపు కార్పొరేషన్‌ల ద్వారా రుణాల మంజూరు 3607 టార్గెట్ ఉండగా ఇప్పటివరకూ సంస్థ ద్వారా 6756 అర్జీలను నగరంలో గల 160 బ్యాంకులకు పంపించినప్పటికీ కొన్ని బ్యాంకుల వారు వివిధ కారణాల ద్వారా రుణాల మంజూరుకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోందని, కేటాయించిన ఖాతాదారునికి తక్షణమే బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించి రుణం మంజూరు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. గత సంవత్సరం కేవలం 50శాతం మాత్రమే రుణాలను మంజూరు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం టార్గెట్ ప్రకారం నూరు శాతం రుణాల మంజూరు చేయాలని తెలిపారు. అలాగే వీఎంసీ సీవోలు బ్యాంకర్లతో కలిసి లబ్ధిదారులతో కలిసి పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల నుంచి బకాయిలు వసూలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు వివరించారు.
ఈ సమావేశంలో యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్ ఎంవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి
పటమట, జూలై 20: వైద్య ఆరోగ్య సేవలపట్ల ప్రజలలో సంతృప్తిస్థాయి పెంచేవిధంగా కార్పొరేట స్థాయి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం కోరారు.