విజయవాడ

కుష్ఠురోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: హెచ్‌ఐవీ, క్షయ, కుష్ఠు వ్యాధిగ్రస్తుల్లో ఆత్మ విశ్వా సం పెంచేలా జిల్లాలోని కౌన్సిలర్లు ప ని చేయాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం కలెక్టర్ తన క్యాం పు కార్యాలయంలో హెచ్‌ఐవీ, క్షయ, కుష్ఠు విభాగాల్లో పని చేస్తున్న డాక్టర్లు, కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, క్షయ, కుష్టు నిర్ధారణకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి గుర్తించే విధంగా పని చేయాలన్నారు. జిల్లాలో 19వేల మంది హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, 6,600 మంది క్షయ వ్యాధిగ్రస్తులు, 324మంది కుష్ఠు వ్యాధిగ్రస్థులు ఉన్నారన్నారు. వీరికి సక్రమ రీతిలో చికిత్స అందించడంతో పాటు పౌష్టికాహారం కూడా అందేవిధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 25వేల మంది మూడు రకాల వ్యాధిగ్రస్థులకు సజ్జ లడ్డూ, వేరుశెనగ చెక్క అందించే విధంగా తగు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు.
ఎయిడ్స్ బారిన పడినవారు తమకు ఉన్న వ్యాధిని గుప్తంగా ఉంచడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, ఇలాం టి వాటిని గుర్తించే విధంగా సంబంధి త కౌన్సిలర్లు పని చేయాలన్నారు. ము ఖ్యంగా సాధికార మిత్రుల సహకారం తో ఈ వ్యాధుల పట్ల అవగాహన క ల్పించి నివారణ మార్గాలను తెలిజేసి స మాజంలో గౌరవప్రదంగా బతికేలా కృషి చేయాలన్నారు. స్థానిక స్వచ్ఛంద సేవల సహకారం తీసుకుని ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారంతో కూడా తీసుకుని బాధితులకు స్వాంతన చేకూరే విధంగా పని చేయాలన్నారు. మందుల కంటే ఆత్మస్థైర్యం ముఖ్యమని, మందులతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ టి.పద్మజారాణి, అడిషినల్ డీఎంహెచ్‌వో టీఎన్‌వి శాస్ర్తీ, వివిధ విభాగాల కో-ఆర్డినేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
20న మీకోసం
మీకోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 20న నందిగామ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. అన్నీ శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. నందిగామ ప్రాంతాల ప్రజలు పాల్గొని తమ సమస్యలను తెలియజేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన మండల కేంద్రాల్లో యథావిధిగా మీకోసం కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు.

నగరంలో మొట్ట మొదటిసారిగా ఐటీ హబ్ ఏర్పాటు
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 17: నగరంలో తొలిసారిగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేసేందుకు వీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని అమరావతి నగరానికి ముఖ ద్వారంగా ఉన్న విజయవాడను ఐటీ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నగరంలో సకల సౌకర్యాలతో కూడిన ఐటీ హబ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కమిషనర్ నివాస్ విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఐటీ హబ్ హంగులకు సరిపడే విధంగా నగర పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు నగరంలోని ప్రముఖ కమర్షియల్ ప్రాంతమైన గవర్నర్‌పేటలోని ఎన్‌టీఆర్ కాంప్లెక్సు మొదటి అంతస్థు లోని మొత్తం షాపులను ఐటీ హబ్‌కు కేటాయించారు. ఈమేరకు శుక్రవారం ఐటీ హబ్ లీజుదారులు, వీఎంసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ షాపులను కూడా లీజ్ పద్ధతిన కేటాయింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఎన్‌టీఆర్ కాంప్లెక్సును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా వీఎంసీ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా మొదటి అంతస్థుకు వెళ్ళేందుకు లిఫ్ట్, ఎస్కలేటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేయాలన్న నిర్ణయం మేరకు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వీఎంసీ అధికారులను ఆదేశించారు. ఐటీ హబ్ లీజుదారులందరూ తక్షణమే తమ షాపులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.