విజయవాడ

ఆదిలోనే హంసపాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 17: ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో మూలపాడులోని ఏసీఏ గ్రౌండ్స్‌లో మొదటిసారి జరగనున్న చతుర్ముఖ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌ను వరుణగండం వెంటాడుతోంది. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వరుణుడు కరుణించకపోవడంతో బీసీసీఐ అధికారికంగా రద్దు చేసింది. దీంతో నాలుగు జట్లకు ఒక్కొక్క పాయింట్ చొప్పున ప్రకటించింది. సుమారు 15 రోజులపాటు నగరంలో అంతర్జాతీయ క్రికెటర్లు సందడి చేయనున్నారనే సమాచారంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆనందంగా మ్యాచ్‌లు తిలకించేందుకు ఎదురుచూశారు. శుక్రవారం మ్యాచ్‌లు రద్దని తెలియగానే నిరాశకు గురయ్యారు. శుక్రవారం మొదటి మ్యాచ్ దేవినేని వెంకటరమణ ప్రణీత గ్రౌండ్ (డీవీఆర్‌పీజీ)లో భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ , డాక్టర్ గోకరాజు లైలాగంగరాజు ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ (జీఎల్‌జీ)లో భారత్ బీ, దక్షిణాఫ్రికా ఏ జట్లు ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
మంగళగిరిలో నెట్ ప్రాక్టీస్
మంగళవారం నగరానికి చేరుకున్న క్రికెటర్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హోటల్ గదులకే పరిమితమయ్యారు. శుక్రవారం మ్యాచ్‌లు రద్దు కావడంతో మంగళగిరిలో ఇండో ర్ క్రికెట్ నెట్స్‌లో కొద్దిసేపు ప్రాక్టీస్ చేశారు. భారత్ ఏ, బీ జట్లు ఉదయం ప్రాక్టీస్ చేయగా మధ్యాహ్నం దక్షిణాఫ్రికా జట్టు ప్రాక్టీస్ చేసింది.
నేడు విశ్రాంతి దినం
బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం శనివారం అధికారికంగా మ్యాచ్‌లు లేవు. దీంతో శనివారం సైతం హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఆదివారం మ్యాచ్‌లు యధాతథంగా జరుగనున్నాయి.