విజయవాడ

ట్రాఫిక్ నియంత్రణలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: నగరంలో నానాటికీ జఠిలమవుతున్న ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించేందుకు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆహ్వానించదగిన శుభ పరిణామమని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన 35మంది ఎన్‌ఎస్‌ఎస్-2 వాలంటీర్లు గత మూడు నెలలుగా నగరంలోని బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నిర్మలా కానె్వంట్ జంక్షన్, ఎంఅండ్‌ఎం తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వచ్ఛందంగా పాల్గొని ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం పోలీసుల విధుల్లో సహకారం అందిస్తుస్తున్నారు.
దీనికి సంబంధించి ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ముద్రించిన వాల్‌పోస్టర్లు, కరప్రతాలను సీపి ద్వారకా తిరుమలరావు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లనుద్దేశించి మాట్లాడుతూ నగరంలో సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరముందన్నారు. ప్రజలకు, వాహనచోదకులకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలకు సహకారంగా వాలంటీర్లు స్వచ్చంద సేవలు అందించడం వల్ల మరింత సత్ఫలితాలు సాధించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ యోగానంద్, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ వెలగజోషి, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయ అధికారి ఎం హరిప్రసాద్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎస్ రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్-2 కో ఆర్డినేటర్లు శ్రీనివాస్, సిహెచ్ కొర్నేల్, పి సురేష్‌బాబు, ఎస్‌ఎస్‌ఎస్-2 ట్రాఫిక్ వాలంటీర్లు పాల్గొన్నారు.