విజయవాడ

ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మ దర్శనానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 17: సాధారణ భక్తులు సైతం ప్రశాంతమైన వాతావరణంలో దుర్గమ్మ దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించేలా చర్యలు చేపట్టనున్నట్లు దుర్గగుడికి ఈవోగా నూతనంగా వచ్చిన వీ కోటేశ్వరమ్మ స్పష్టం చేశారు. తల్లి ఆశీస్సులతోనే తాను ఈవోగా వచ్చానని ఈఅంశాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శనం కోసం వచ్చిన భక్తులకు వౌళిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపడతానని చెప్పారు. ఉద్యోగులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులను సమన్వయం చేసుకుని ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నుండి నిధులను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సిబ్బందితోపాటు, ధర్మకర్తల సలహాలు తీసుకొని ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి సూచనలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నానన్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించే చీరల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడతానన్నారు. విరాళాలిచ్చిన దాతలను తగురీతిలో గౌరవించేలా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆమె మల్లేశ్వరస్వామిని దర్శనం చేసుకుని, తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని అర్చకుల దివ్య ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం ఈవోగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈసమావేశంలో సహాయ ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం ఈవోను ఆలయాధికారులు దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, ఎన్ రమేష్, సహాయ ఈవో సాయిబాబా, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, ధర్మారావు, పాప, తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.
తొలిరోజే పర్యటన, తనిఖీలు, ఆదేశాలు
దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వీ కోటేశ్వరమ్మ తొలి రోజే పర్యటనలు, తనిఖీలు, ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారం ఆమె అమ్మవారి సన్నిధిలో విధి నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి దర్శనం, మీడియా సమావేశం అయిన తరువాత ఆమె నేరుగా మల్లిఖార్జున మహామండపం కిందకు చేరుకొని అక్కడ ఉన్న స్ధలానికి పరిశీలించి ఈస్థలాన్ని లెవెల్ చేసి పార్కింగ్‌కు అనువుగా తయారు చేయాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తర్వాత అమ్మవారి సన్నిధిలో భక్తులకు సేవలు అందించిస్తున్న బ్యాటరీ కార్లను పరిశీలించి వాటిని భక్తుల వినియోగంలోకి తీసుకురావటంతోపాటు, అవుట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.