విజయవాడ

పన్ను భారం లేని పాలన ఘనత టీడీపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 17: నగరాభివృద్ధిపై అర్థరహిత విమర్శలు చేస్తున్న విపక్షాలపై మేయర్ కోనేరు శ్రీ్ధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లతో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేని విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శలు, ఆందోళనలు ప్రజలను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవడానికేనని అన్నారు. రాజకీయాల్లోనే కాక వయస్సులోనూ తల పండిన నేతలు సైతం కేవలం తమ రాజకీయాల కోసమే పర్యటనలు, పాదయాత్రలు చేయడమే కాకుండా టీడీపీ పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలను పంచడం విచారకరమని మేయర్ శ్రీ్ధర్ వైసీపీ, వామపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. శుక్రవారం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన విపక్షాల తీరును ఎండగట్టారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నేతలు వీఎంసీకి ఒక్క అవార్డునైనా తీసుకురాలేకపోయారని, స్వచ్ఛమైన తమ పాలనను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 4వ ర్యాంకు తోపాటు అత్యంత నివాస యోగమైన నగరంగా విజయవాడను గుర్తించిందంటే జరుగుతున్న, జరిగిన అభివృద్ధే కారణమన్నారు. 2013లో నీటి చార్జీల పెంపుపై వచ్చిన జీవోను చూపించి తమ పాలనలోనే నీటి చార్జీలు పెరిగాయంటూ విపక్షాలతోపాటు టాక్స్‌పేయర్స్ అంటూ కొన్ని అసోసియేషన్లు పిచ్చి పిచ్చిగా ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. తాము నగర పాలన చేపట్టే నాటికి వీఎంసీ తీవ్ర ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎదుర్కొనడానికి గత పాలకులు కారణం కాదా అని ప్రశ్నించారు. వీఎంసీ ఉద్యోగులతోపాటు కనీసం పారిశుద్ధ్య కార్మికులకైనా జీతాలివ్వక, ఆకలితో విధులను నిర్వర్తించిన పరిస్థితి నుంచి నేడు ప్రతి నెలా 5వ తేదీ లోపుగా సక్రమంగా జీతాలివ్వడం కనిపించకపోవడం గర్హనీయమన్నారు. అలాగే వందల కోట్లను అప్పుల ఊబి నుంచి ఖజానా తేరుకునే విధంగా కృషి చేయడమే కాకుండా గత నాలుగేళ్లుగా ఇప్పటికీ 2100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు ఏమైనా అనుమానాలు ఉంటే వీఎంసీకి వచ్చి రికార్డులను పరిశీలించుకోవచ్చునన్నారు. ఆ ధైర్యం ఉంటే ఎవరైనా రావచ్చునంటూ సవాల్ విసిరారు. అలాగే విపక్షాల డివిజన్లలో అభివృద్ది పనులు జరపడం లేదంటూ విపక్షాల విమర్శలకు సమాధానంగా నగర డివిజన్లలో ఎంతెంత వ్యయంతో జరిపిన అభివృద్ధి పనులపై శే్వత పత్రాన్ని విడుదల చేశారు. తమ ఐదేళ్ల పాలన ముగిసే నాటికి వీఎంసీని అప్పుల ఊబి నుంచి శాశ్వత విముక్తి కలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే గత పాలకుల చేతకాని తనంతో అసంపూర్తి నిర్మాణాలతో వదిలేసి వెళ్ళిన జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పక్కాగృహాల నిర్మాణాలను కూడా పూర్తిచేస్తామని, ఇందుకు హడ్కో నుంచి 100 కోట్లను రుణంగా తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.