విజయవాడ

జ్ఞానభేరితో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: విద్యార్థులు విజ్ఞాన విషయాలతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే విధంగా జ్ఞానభేరి నిర్వహిస్తున్నామని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖ అధికారులు, వైస్‌ఛాన్‌లర్స్, వివిధ శాఖల అధికారులతో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న జ్ఞానభేరి కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో జరగనున్న జ్ఞానభేరి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలలకు చెందిన 15వేల మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇందులో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్నారు. విద్యార్థులకు మంచినీరు, ఫుడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ప్రతి కళాశాల నుంచి విద్యార్థులను కార్యక్రమానికి తీసుకువచ్చి మరలా కళాశాలకు తిరిగి తీసుకువెళ్ళే విధంగా నోడల్ అధికారిని నియమించి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రతినిధి చరణ్‌సాయి, డాక్టర్ మూర్తి రెమిల్లా తదితరులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖీ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న అవిష్కరణలతో అనేక విజ్ఞాన విషయాలను ఈ సమావేశంలో వివరించనున్నారని మంత్రి తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జ్ఞానభేరి కార్యక్రమంపై విద్యార్థులతో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు అందజేస్తారని మంత్రి తెలిపారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ జ్ఞానభేరి నిర్వహణకు వివిధ శాఖలకు చెందిన అధికారులకు ప్రత్యేక విధులను కేటాయిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రెవెన్యూ, విద్యాశాఖ, పోలీస్, రవాణా తదితర ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. దూరప్రాంతాల నుండి వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు సహకరించేందుకు ప్రతి కళాశాలకు ఒక నోడల్ అధికారిని నియమించామని, విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌హెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయ్‌రాజ్, వైస్‌చైర్మన్ కోటేశ్వరరావు, వరదరాజన్, కృష్ణా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ రామకృష్ణారావు, జేసీ-2 పిడుగు బాబురావు, డీటీసీ ఈ మీరాప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.