క్రైమ్/లీగల్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, సెప్టెంబర్ 19: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వం లెక్కల్లోకి రాని రూ.64,500లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎసీబీ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాద్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రికార్డులు, కంప్యూటర్లను పరిశీలించారు. అనుమతి లేని లేఖర్లు ఐదుగురిని విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. రిజిస్ట్రేషన్‌లు, ఇసీలు, ప్రభుత్వ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం కంటే అదనంగా నగదు ఉందని భావించామన్నారు. దానిని లంచంగా భావించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఎసీబీ సీఐలు కె వెంకటేశ్వర్లు, డి రమేష్‌బాబు, కెనడి, హ్యాపీ కృపానందం తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో ఆరుగురికి పదేళ్లు జైలు, లక్ష జరిమానా
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: గంజాయి అక్రమ రవాణా కేసులో ఆరుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. అందిన సమాచారం మేరకు పటమట పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద 2017 మే 26న వాహనాలు తనిఖీ చేస్తూ గన్నవరం వైపు నుంచి వస్తున్న క్వాలిస్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లలో డిక్కీల్లో ప్లాస్టిక్ కవర్‌లతో కట్టిన 122.300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం అన్నవరంలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి రవాణా చేస్తున్న నిందితులు నేతుల శోభారాణి, హబీబ్ అహ్మద్, అబ్దుల్ ఖలీల్, కెతావత్ భిక్షా, గాలీబ్ బిన్ ఫైజల్, వహీద్ ఖాన్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులను విచారించగా నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ప్రేమికుల ఆత్మహత్య
తిరువూరు, సెప్టెంబర్ 19: మండలంలోని కోకిలంపాడుకు చెందిన యువతీ యువకులు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జొన్నలగడ్డ తిరుపతిరావు (23) వివాహితుడు కాగా ఒక కుమారుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కొంగల శ్రీలక్ష్మీ(19) అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, శ్రీలక్ష్మిని రెండో పెళ్ళి చేసుకోవడానికి తిరుపతిరావు చేస్తున్న ప్రయత్నాలు అతని భార్య దీప్తి అంగీకరించకపోవడంతో కొద్దిరోజులుగా వివాదం తారాస్ధాయికి చేరింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. శ్రీలక్ష్మీని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రి శివాలయానికి తీసుకెళ్ళి తిరుపతిరావు వివాహం చేసుకున్నాడు. అనంతరం అక్కడే పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని ఇరువురు తాగారు. అపస్మారక స్ధితిలో ఉన్న వీరిని పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందారు. పెనుబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.