విజయవాడ

దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబరు 21: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరస్పర సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులకు సూచించారు. వచ్చే నెల 10నుండి ప్రారంభం కానున్న దసరా శరన్నావరాత్రోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీకాంతం, నగర పోలీసు కమిషనర్ ద్వారాకాతిరుమలరావు, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఇతర అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ శరన్నవరాత్రోత్సవాలు పూర్తయ్యేంత వరకు భక్తులను ఎటువంటి అసౌకర్యం కలగరాదని ఆదేశించారు. ఈసందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మహోత్సవాలు సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లులను ఈవో వి కోటేశ్వరమ్మ కలెక్టర్‌కు వివరించారు. అమ్మవారి దర్శన సమయ వేళలు, క్యూమార్గాల ఏర్పాటు, ఉచిత ప్రసాదాల వితరణ, వీఐపీల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ రకాలైన వౌలిక సదుపాయాల కల్పన, ఉచిత బస్‌ల ఏర్పాటు, అదనపు సిబ్బంది ఏర్పాటు, ఎన్‌సీసీ విద్యార్థుల సేవలు, ఉచిత అన్నదాన ప్రసాద వితరణ, అదనపు సిబ్బంది ఏర్పాటు, మైక్ ప్రచారం, ఉచిత మెడికల్ క్యాంప్, చెప్పుల స్టాండ్‌లు, క్లోక్ రూమ్ ఏర్పాటు వంటి అంశాలను ఈవో వీ కోటేశ్వరమ్మ కలెక్టర్, పోలీస్ కమిషనర్, తదితరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, వివిధ సెక్షన్‌లకు చెందిన అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్, సీపీ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తర్వాత వీరికి అర్చకులు అమ్మవారి దివ్య ఆశీస్సులను అందచేయగా ఈవో వీరికి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.