విజయవాడ

మేయర్ కోనేరు ఒంటరి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 21: వీఎంసీకి చెందిన కమ్యూనిటీ స్థలాల్లో నిర్మితమైన వివిధ కల్యాణ మండపాలు, ఫన్‌టైమ్స్ రిక్రియేషన్ సెంటర్లు, పార్కులను స్వాధీనం చేసుకునేందుకు వీఎంసీ కసరత్తు ప్రారంభించింది. లక్షలాది రూపాయల ఆదాయ వనరుగా ఉన్న ఈ సెంటర్లను వీఎంసీ నేతృత్వంలోనే నిర్వహిస్తే ఖజానాకు ఆర్ధికంగా ఊరట ఉంటుందన్న ఉద్దేశ్యంతో మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ముంబాయి పర్యటనలో ఉన్న మేయర్ శ్రీ్ధర్ నగరానికి రాగానే ఈవిషయంపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఫన్‌టైమ్స్ లాంటి 5 కమ్యూనిటీ స్థలాలపై ఈవివాదం నడుస్తోంది. కమ్యూనిటీ ప్రయోజనాలను చూపి రిజిస్టర్ అయిన ఈ సంస్థలకు కల్యాణ మండపాలు, రిక్రియేషన్ సెంటర్లు, పార్కులు, నిర్వహణ అప్పగించడం జరిగింది. వాస్తవానికి నో లాస్, నో ప్రాఫిట్‌గా కార్యనిర్వహణ జరగాల్సిన ఈ సంస్థల పనితీరు క్రమంగా కమర్షియల్ సంస్థలకు దీటుగా మారాయి. లక్షలాది రూపాయల డిపాజిట్లు, సభ్యత్వ ఫీజులు, వేలాది రూపాయల అద్దెల వసూలు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నాయి. వాటి సంవత్సర ఆదాయంలో ఒక్క రూపాయైనా వీఎంసీకి జమ కాకపోవడంతో ఏడాదిలో కోట్లాది రూపాయలను కోల్పోతున్న వైనం ఆయా రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుండగా, ఇదే విషయాన్ని మేయర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు నివేదించారు. ఈ విషయంలో మేయర్ చేసేది ఒంటరి పోరాటమేనే చెప్పాలి. మేయర్‌కు ప్రభుత్వం ఇచ్చే సహకారం ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ కార్పొరేటర్లు బహిరంగగానే మేయర్‌కు వ్యతిరేకంగాను, ఆ సంస్థలకు అండగా నిలిచారు. అంతేకాకుండా ఆ సంస్థల నిర్వాహకులు, మేయర్ వ్యతిరేక కార్పొరేటర్లు కూడా అధికార టీడీపీకి అనుకూల వర్గం కావడంతో నగరంలో ఈ అంశం బలమైన సామాజిక వర్గంలోనే పోరుగా మారింది. అయితే మేయర్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడవ్వడం, ఆ సామాజిక వర్గ పెద్దలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయంపై నగర టీడీపీలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
సొసైటీ కల్యాణ మండపాలు, రిక్రియేషన్ సెంటర్ల తో వీఎంసీ ఆదాయం కోల్పోవడమే కాకుండా సామాన్యుల దరిచేరని సంస్థల సేవల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన మేయర్ నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం ఎంఎయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కరకల్ వలవన్ తో కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్పొరేటర్లు, అధికారుల సమావేశంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆయా సంస్థల పనితీరుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. మేయర్ చర్యలను బాహాటంగానే వ్యతిరేకిస్తున్న ఇద్దరు కార్పొరేటర్ల తీరుతో ఈ అంశం వీఎంసీలో రచ్చ రచ్చగా మారింది. నూటికి నూరు శాతం సొసైటీ బైలాకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థలను నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వాటిని వీఎంసీ ద్వారానే నిర్వహిస్తే సామాన్యులకు సైతం ఆయా సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా ఖజానాకు కూడా ఆర్ధిక బలోపేతానికి సహకరిస్తుందనేది మేయర్ వాదన. ప్రభుత్వ పరంగా అవసరమైన జీవో తీసుకుచ్చి సొసైటీల నుంచీ కమ్యూనిటీ స్థలాలకు విముక్త కల్పంచాలన్న లక్ష్యంతో మేయర్ తన చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ముంబాయి నుంచి నగరానికి చేరుకోగానే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటితోపాటు నగరంలోని ప్రముఖంగా ఉన్న ఐవీ ప్యాలెస్, ఆంధ్రా హాస్పటల్ లీజుల వ్యవహారంలో కూడా వీఎంసీ కి కలుగుతున్న నష్టాలను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఐవీ ప్యాలెస్‌కు ప్రతి మూడు సంవత్సరాలకు కేవలం 15శాతమే లీజు రెన్యువల్ చేయాలన్న జీవో తోపాటు ఆంధ్రా హాస్పటల్ ప్రతి మూడు సంవత్సరాలకు 10శాతం పెంచే లీజు రెన్యువల్ జీవోలను రద్దు చేసి వీఎంసీయే గుడ్‌విల్, అద్దె విలువ నిర్ణయించుకునే విధంగా జీవోను తీసుకుచ్చేందుకు మేయర్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు ఉన్న గవర్నర్‌పేట ప్రాంతంలో అడుగు స్థలం 80 నుంచి 100 రూపాయల అద్దె పలుకుతుండగా, ఇవి మాత్రం కేవలం 20 నుంచి 30 రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయడం వీఎంసీ ఖజానాకు తీరని నష్టంగానే మారింది.