విజయవాడ

సీఎం యువ నేస్తం నిరుద్యోగులకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, సెప్టెంబర్ 21: నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చేపట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి జిల్లా నిరుద్యోగ యువత సత్వరమే తమ పేర్లను సంబంధిత వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యువనేస్తం.ఎపి.జివోవి.ఇన్)లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునేందుకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ లేదా రెండేళ్ల డిప్లమో చేసి ఉండాలన్నారు. 22- 35ఏళ్లలోపు వయసు గలవారికి, కుల, సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్నారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ సర్ట్ఫికెట్‌లు కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువతకు ఈ అవకాశం లభిస్తుందన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లైతే 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్ విధానాలను అధ్యయనం చేయాలి వీఎంసీ మేయర్ కోనేరు శ్రీ్ధర్

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 21: దేశంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో అమలవుతున్న సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాల్లో బెస్ట్ విధానాలపై అధ్యాయనం చేయాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ సూచించారు. ముంబాయిలో జరుగుతున్న 15వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ అనే అంశంపై జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఆయన మూడవ రోజు జరిగిన కార్యాక్రమంలో భాగంగా సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన పదర్శనలో వీఎంసీ లో అమలుచేస్తున్న సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్, కాల్వగట్ల సుందరీకరణ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్‌ను సందర్శించారు. అలాగే మిగిలిన కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టాల్స్‌ను కూడా పరిశీలించిన మేయర్ మాట్లాడుతూ వీఎంసీలో జరుగుతున్న మేనేజ్‌మెంట్ విధానాల కంటే మరింత మెరుగైన విధానాలు ఎక్కడైనా అమలవుతున్నాయోనన్న విషయాలపై పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు.