విజయవాడ

సాగర తీరంలో డాల్ఫిన్ పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 21: కృష్ణా జిల్లా సముద్ర ప్రాంతంలో డాల్ఫిన్ పార్కుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. దీనితోపాటు నెమలి పార్కు ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. వీటిని ఏర్పాటు చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులతో పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జ్ఞాన భేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచన మేరకు ఈ పార్కుల ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
గురజాడకు ఘనంగా నివాళులు
నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ బి లక్ష్మీకాంతం శుక్రవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గురుజాడ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సంస్కర్తగా , సాంఘిక దురాచారాలను పార ద్రోలడానికి ఆయన చేసిన కృషిని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. కన్యాశుల్కం నాటకాన్ని వాడుక బాషలో రచించి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికిన గొప్ప వ్యిక్తి గురజాడ అప్పారావుఅని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి లావణ్య వేణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
24న మీ కోసం ప్రత్యేక గ్రీవెన్స్
ఈనెల 24న సోమవారం మీ కోసం ప్రత్యేక గ్రీవెన్స్ విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో యథావిధిగా మీకోసం ఉంటుందన్నారు.