విజయవాడ

రాఫెల్ కుంభకోణంలో ప్రధాని దళారీ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీ దళారీగా వ్యవహరించారనే దానికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ప్రఖ్యాత ప్రభుత్వ సంస్థ హెచ్‌ఏఎల్‌ను కాదని ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌కి అనుకూలంగా మోదీ వ్యవహరించినట్లు హోలాండ్ ప్రకటించారని, రాఫెల్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ప్రధాని ఇప్పుడు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 2018 ఫిబ్రవరి 7న దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాఫెల్‌కు సంబంధించి ఏ ఇండియన్ పార్టనర్‌ని సెలెక్ట్ చేయలేదని చెప్పారని, కానీ 2017 అక్టోబర్ 20న రిలయన్స్ కంపెనీ అధినేత అనిల్ అంబానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఒక్కో యుద్ధ విమానం ఖతార్, ఈజిప్ట్ దేశాలకు రూ. 1319.80 కోట్లకి అమ్మితే మనకు రూ. 1670.70 కోట్లకు అమ్మారని, దీంట్లో వ్యత్యాసం రూ. 380 కోట్లు ఉందన్నారు. రాఫెల్ కుంభకోణంపై మాట్లాడటంలో ఎంపీ జీవీఎల్ పత్తా లేకుండా పోయారన్నారు. ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే నైతిక అర్హత లేదని, తక్షణమే రాజీనామా చేయాలని గొట్టిపాటి డిమాండ్ చేశారు. పార్టీ మారే ఊసరవెల్లి కన్నా లక్ష్మీనారాయణ నూజివీడులో ఆలయాల భూములు బినామీల పేరిట అన్యాయంగా అనుభవిస్తోందని వాస్తవం కాదా? అని గొట్టిపాటి ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్ పాల్గొన్నారు.

బీజేపీ కోవర్టు రాజకీయాలు
* వైసీపీ, జనసేనతో కుమ్మక్కు:పంచుమర్తి
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 22: బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలూ ఒక్కటేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాకినాడ సభలో రాంమాధవ్ వ్యాఖ్యలు అందరికీ అర్థమయ్యాయని, తెలుగుదేశం యేతర పార్టీలతో కలిసి పని చేస్తామని ఆయన చెప్పకనే చెప్పారన్నారు. వైకాపాతో, పవన్ కల్యాణ్‌తో కలిసి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని తాము ఎప్పుడో చెప్పామన్నారు. అవిశ్వాసం తీర్మానానికి మద్దతు పలకాల్సి వస్తుందని, వైకాపా ముందురోజే రాజీనామాల డ్రామా ఆడిన విషయం కేవలం బీజేపీతో కుమ్మక్కవడం వల్లే అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో వైకాపా నాయకుడు కాపు రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి కార్యకర్తలతో సహా బీజేపీకి ఏరకంగా మద్దతిచ్చారో కన్నా లక్ష్మీ నారాయణ వైకాపాలో చేరటానికి సర్వం సిద్ధం చేసుకుని, చివరికి భాజపా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం, అదేవిధంగా ఐవైఆర్ కృష్ణారావు కూడా అకస్మాత్తుగా అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన వైనం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు చంద్రబాబుకు అఖండ విజయం కట్టబెట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు
పటమట, సెప్టెబర్ 22: ఆహార పదార్థాలలో కల్తీకి, తప్పుడు తూకాలకు పా ల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శనివారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విజిలెన్స్ శాఖ అధికారులతో జిల్లాలో చేపట్టిన తనిఖీలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో వివిధ వ్యాపార సంస్థలను తనిఖీ చేసి తప్పుడు తూకాలకు పాల్పడుతున్న 30మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఔషధాల నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 48 మెడికల్ షాపులను తనిఖీ చేసి వాటిలో ప్రభుత్వ నిబంధనలు పాటించని రెండు షాపులపై కేసులు నమోదు చేశామని కలెక్టర్ వివరించారు.
రక్తదానం అవసరాన్ని గుర్తించాలి
రక్తదానం అవసరాన్ని ప్రతి ఒక్క రూ గుర్తించాలని, ఈ దిశగా అవగాహ న కల్పించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిర ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అందించే వ్యక్తికి మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అదించటం ద్వారా మరొకరికి ప్రాణభిక్ష పెట్టినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఏ శ్రీ్ధర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఇండ్ల రవి, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.