విజయవాడ

మావోల దాడులు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 23: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ప్రజా ప్రతినిధులపై మావోయిస్టులు దాడులకు పాల్పడటం గర్హనీయమని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు దారి కాచి హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం తన నివాసం వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మావోయిస్టులు ఇటువంటి చర్యలకు దిగడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలలోకి వెళుతున్న ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు పన్నిన కుట్ర దుర్మార్గమైనదన్నారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ హత్యను ఖండించాలన్నారు. సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన సంక్షేమానికి కిడారి సర్వేశ్వరరావు చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సందడిగా సాగిన హేపీ సండే
లబ్బీపేట, సెప్టెంబర్ 23: కుర్రకారు జోరు, చిన్న పిల్లల కేరింతల మద్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేశాయి. చిన్నపిల్లలు ప్రదర్శించిన రింగ్ డ్యాన్స్ ప్రేక్షకుల కేరింతల నడుమ ఆదివారం హేపీ సండే సందడి, సందడిగా కొనసాగింది. చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వయస్సును మరిచి పాటలతో, కేరింతలతో ఎంజా య్ చేశారు.విజయవాడ నగరపాలక సంస్థ, సన్‌షైన్ డ్యాన్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ హేపీ సండే కార్యక్రమంలో కెబిఎన్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫోక్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఇన్‌స్ట్రమెంట్ ప్లేయింగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. నర్తన డ్యాన్స్ ఆకాడమీ వారు ప్రదర్శించిన గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రేక్షకులను కనువిందు చేశాయి. కళాజాతి బృందంచే ప్రదర్శించిన జానపద నృత్యాలు ప్రేక్షకులను మైమరిపిరించినాయి. సన్‌షైన్ బృందంచే డ్యాన్సులు, ఎరోబిక్ టీమ్ వ్యాయామ ప్రదర్శన ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబాడీ, క్రికెట్ వంటి క్రీడలను ప్రజలకు అందుబాటులో ఉంచగా ప్రజలు వాటిలో పాల్గొని ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆపీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, కె దుర్గ ప్రసాద్‌తో పాటు సన్‌షైన్ ఇవెంట్స్ నిర్వహకులు, పరిసర ప్రాంత ప్రజలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ప్రత్యేక డ్రైవ్‌తో పెళ్లికానుక
విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 23: జిల్లా వ్యాప్తంగా చంద్రన్న పెళ్లికానుకపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఈ విలేఖరికి తెలిపారు. బాల్యవివాహాల నిరోధించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా ఈ చంద్రన్న కానుకపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వధువుకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు ఉద్దేశించిన ఈపథకం జిల్లాలో మంచి ఫలితాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 22136 పెళ్లి జంటలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే, జిల్లా నుండి 1979 మంది చంద్రన్న పెళ్లికానక కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వీటిలో 471 వివిధ కారణంలో తిరస్కరణకు గురయ్యాయన్నారు. 1506 జంటలకు పెళ్లికానుక అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ మిత్రల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించి ఈ పథకం అర్హులైన వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు మండల వెలుగు కార్యాలయంలోనూ, అర్బన్ పరధిలో ఉన్న వారు మున్సిపల్ లెవల్ మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు.