విజయవాడ

ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 23: ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయు ధ్యేయమని ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు డి శ్రీను అన్నారు. స్థానిక వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ సాధిస్తామని, 398 ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు సాధిస్తామన్నారు. ఎస్జీటి క్యాడర్‌ను స్కూల్ అసిస్టెంట్లుగా మారుస్తామని, నర్సరీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. అనంతరం మైలవరం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కె కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పి గోపాల్, గౌరవాధ్యక్షునిగా కె వెంకట నారాయణ, అసోసియేట్ అధ్యక్షులుగా కె జగన్నాధం, పి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా నరేంద్ర, కల్పన, అమీర్ భాష, పెద వెంకటేష్, నాంచారమ్మ, సతీష్, నాగరాజు, దుర్గారావు ఎన్నికయ్యారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలి
ఏ కొండూరు, సెప్టెంబర్ 23: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, ఏ కొండూరు మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వీరికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతే రాజు గ్రామస్వరాజ్యమే ధ్యేయంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కృష్ణారావుపాలెం పంచాయితీ శివారు దీప్లానగర్ తండాను సందర్శించి కిడ్నీవ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను, డయాలసిస్ రోగులను పరామర్శించారు. అనంతరం ఎలిమెంటరి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కిడ్ని వ్యాధిగ్రస్తులు ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాలని సూచించారు. మండలంలో ఆర్‌ఓ ప్లాంట్‌ల ఏర్పాటుకు జాయింట్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. నూజివీడులో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా లేదని, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో తిరువూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

గణపతి పప్పా మోరియా
మచిలీపట్నం, సెప్టెంబర్ 23: తొమ్మిది రోజుల పాటు చలువ పందిళ్ల కింద ప్రత్యేక పూజలు అందుకున్న గణనాధుల నిమజ్జనోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోలాహల వాతారణం నెలకొంది. సాగర తీరంతో పాటు కృష్ణానది తీరాల్లో విఘ్న వినాయకుడి నిమజ్జనోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మచిలీపట్నం శివారు మంగినపూడి బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాలైన ఘంటసాల, పెడన, బంటుమిల్లి, గూడూరు తదితర ప్రాంతాల నుండి వందలాది గణనాధుల విగ్రహాలను మంగినపూడి బీచ్‌లో నిమజ్జనం చేశారు. బీచ్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి బీచ్‌లో ప్రత్యేకమైన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. డియస్పీ మహ్మద్ బాషా, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.