విజయవాడ

రాఫెల్ కుంభకోణంతో భారతీయులను మోసం చేసిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 24: భారత దేశ రక్షణకు సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 133కోట్ల మంది భారతీయులను మోసం చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపుమేరకు ఏపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరంలోని లెనిన్ సెంటర్లో నిర్వహించిన నిరసన, మానవహారంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌చాందీ, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, క్రిస్ట్ఫోర్ తిలక్, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈకుంభకోణంపై విచారణ జరిపేందుకు జేపీసీ నియామకానికి కేంద్రం ఎందుకు వెనుకాడుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై జగన్ ఒక్కమాటైనా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రాఫెల్ కుంభకోణం జరిగిన తీరు, లబ్ధిపొందిన బీజేపీ కార్పొరేట్ సంస్థలపై జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపిన ఆయన ఈవిషయంపై ఫిర్యాదు తీసుకోవడానికి గవర్నర్ సుముఖంగా లేకపోవడం గర్హనీయమన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా కాంగ్రెస్- గాంధీ దేశానికి చేసిన సేవలను వివరించడమే కాకుండా బీజేపీ, టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పాజిటీవ్ మేనిఫెస్టోను రూపొందిస్తున్నామన్నారు. కేరళ వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ నిర్మించనున్న వెయ్యి పక్కాగృహాల నిర్మాణానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేయూత ఇస్తోందని, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన రూ.5లక్షల చెక్కు విరాళాన్ని కేరళ మాజీ సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌చాందీ ద్వారా కేరళ కాంగ్రెస్ పార్టీకి అందజేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో 12లక్షల మంది ఓటర్లు గల్లంతవ్వడం, అర్హత లేని వారు ఓటర్లుగా ఉండటాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ ఆర్‌బీఎస్‌కే ఉద్యోగులు రఘువీరారెడ్డికి వినతిప్రతం అందజేశారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని బాల సురక్ష పథకంగా పేరు మార్చిన ఏపీ ప్రభుత్వ చర్యలతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వివరించారు. ఈకార్యక్రమంలో పలువురు ఏపీసీసీ నేతలు, నగర నేతలు పలువురు పాల్గొన్నారు.