క్రైమ్/లీగల్

దోపిడీ కేసులో నిందితుని అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: బట్టల వ్యాపారం ముసుగులో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న కేసులో ఓ వ్యక్తిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి సుమారు 4లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన మహ్మద్ యూనస్ (46) అనే వ్యక్తి గతంలో టింకరింగ్ పని చేసి మానేశాడు. అనంతరం మీరట్‌లో కొంతకాలం హోటల్ నడిపి నష్టాలు రావడంతో మానుకున్నాడు. ఈక్రమంలో నేరాలకు అలవాటు పడి హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల బట్టల వ్యాపారం నిర్వహించే తన సమీప బంధువు సలహా మేరకు తాను కూడా బట్టల వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. బస్సుల్లో ప్రయాణిస్తూ తోటివారికి మత్తు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చి నిద్రలోకి జారుకోగానే వారిని దోచుకోవడం ఆరంభించాడు. ఈవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు తదితర మార్గాల్లో విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ రాత్రివేళల్లో ఈతరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా గత ఏడాది జనవరి, మే, ఈ ఏడాది సెప్టెంబర్ తదితర మాసాల్లో ఐదు నేరాలకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మీదట నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే 74గ్రాముల బంగారం, లక్షా 19వేల 500రూపాయలు నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.