విజయవాడ

ఓటర్ల జాబితా సమరి రివిజన్ గడువుపొడిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: ఫారం 6,7,8,8కి సంబంధించిన క్లెయిమ్స్ మరియు అబ్జక్షన్స్ అన్నింటిని జూలై 7నాటికి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు ఎ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) భన్వర్‌లాల్‌కు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం హైదరాబాద్ నుండి 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా ఇన్‌టెన్సివ్ సమరి రివిజన్, ఇవియంలు, ఫారం 6,7,8,8ఎ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ విజయవాడ కృష్ణా పుష్కరాలకు కేంద్ర బిందువైనందున, ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నందున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఇన్‌టెన్సివ్ సమరి రివిజన్ ఆఖరి తేదీని పొడిగించాలని జిల్లా కలెక్టర్ కోరారు. సమరి రివిజన్ పనులు ప్రారంభించడం జరిగిందని, సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఫారం 6,7,8,8ఎకు సంబంధించి క్లెయిమ్స్ మరియు అబ్జక్షన్స్ అన్నింటిని జూలై 7 నాటికి పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 321 మీ-సేవ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 196 కేంద్రాలలో ఓటరు గుర్తింపు కార్డులు, 125 కేంద్రాలలో ప్లాస్టిక్ కార్డుపై కలర్ ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో గత 6 నెలల్లో 11,486 ఫొటో ఓటర్ గుర్తింపు కార్డులను జారీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 864 డిఫెక్టివ్ ఇవియంలు ఉన్నాయని, వీటిని హైదరాబాద్ పంపడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి పెండింగ్ ఆడిట్ పేరాలు లేవన్నారు. తిరువూరు శాసనసభ నియోజకవర్గ ఇఆర్‌వోను మార్చడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.
ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, విజయవాడ, నూజివీడు సబ్‌కలెక్టర్లు లక్ష్మీశా, డా.జి.సృజన, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అరుణ్, ట్రైనీ కలెక్టర్ బాలాజీ, శాసనసభ నియోజకవర్గాల డెప్యూటీ తహశీల్దార్‌లు పాల్గొన్నారు.