విజయవాడ

పవర్ బోటింగ్‌కు అంతా రెఢీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 15: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ స్థాయి పవర్ బోట్ పోటీలకు రాజధాని విజయవాడ వేదిక కానుందని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎఫ్1హెచ్ 2ఓ పవర్ బోట్ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం పవర్ బోట్ ఛాంఫియన్ షిప్ పోటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు పున్నమిఘాట్ వద్ద కృష్ణానదిలో నిర్వహించే బోట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 9 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. 19 బోట్లతో డైవర్లు పాల్గొనే ఈ పోటీలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో బోట్లు కృష్ణా నదిలో ప్రయాణిస్తాయన్నారు. మధ్యాహ్నం 3.30 నిముషాల నుండి సాయంత్రం 5.30 నిముషాల వరకూ బోట్ రేస్ డైరెక్షన్ ప్రాక్టీస్ ఉంటుందన్నారు. 17వ తేదీ శనివారం సాధారణ ప్రాక్టీస్ ఉంటుందన్నారు. అదివారం ఫైనల్ పోటీలు ఉంటాయని, ఈ పోటీలకు కూడా సీఎం హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 3.15 నిముషాల నుండి 3.35 నిముషాల వరకు ఫార్ములా - 4 రేస్, సాయంత్రం 4 గంటల నుండి 5 గంట వరకు ఫార్ములా -1 గ్రాండ్ ఫిక్స్ రేస్ సుమారు 50 నిముషాలపాటు ఉంటాయన్నారు. సాయంత్రం 5 గంటల నుండి బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా పార్కింగ్ ప్రదేశాలను, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసినట్లు తెలిపారు. పోటీలలో దురదృష్టవశాత్తు గాయాలైతే ప్రకాశం బ్యారేజ్ గ్రీన్ చానల్ ద్వారా పదినిముషాల్లో మణిపాల్ అసుపత్రికి చేరుకునే విధంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఛాంపియన్ షిప్ పోటీల వేదిక వద్ద అత్యవసర మందులతో బేస్ క్యాంప్, హెల్ప్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు అందరూ ఆహ్వానితులేనన్నారు. సుమారు లక్ష మంది ఈ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రత్యక్షంగా చూసేవిధంగా కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా నగరమంతా వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.
కనువిందు చేసిన ఛాంపియన్‌షిప్ బోట్లు
ఎఫ్1హెచ్2ఓ పోటీల్లో పాల్గొనే బోట్లు నగరంలో కనువిందు చేశాయి. ప్రపంచ ఛాంపిషన్ షిప్ పోటీల్లో పాల్గొనే బోట్లను నగరంలో ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వద్ద ఈ వాహనాల ప్రదర్శనను కలెక్టర్ బి లక్ష్మీకాంతం జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలపై యఫ్1హెచ్2ఓ బోట్లు, డైవర్లు ప్రదర్శన చేస్తూ సాగిన బోట్ పేరేడ్ ర్యాలీని నగరంలోని బందరు రోడ్డుపై నిర్వహించారు. నగర వాసులకు పరిచయం చేస్తూ బోట్స్ పేరేడ్ ర్యాలీ బందరు రోడ్డుపై సాగుతూ ముందుకు సాగింది. పేరేడ్ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, విశేష వేషధారణలు నగర వాసులను ఆకట్టుకున్నాయి.