విజయవాడ

జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 15: జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలను అందిస్తామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. నిరుపేదలందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. నవంబర్ ఆఖరి వారంలో లక్షా 50 వేల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై గురువారం కలెక్టర్ తన క్యాంపుకార్యాలయంలో జిల్లాలోని తహశీల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జిల్లాలో లక్షా 50 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి లక్షా 50 వేల మంది లబ్ధిదారులు హాజరు కావడం కూడా చరిత్రలో మిగులుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టాలను గౌరవంగా అందించేందుకు పట్టాతో పాటు కేటాయింపుపత్రం, జాకెట్, పసుపు, కుంకుమ కిట్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. సూక్షప్రణాళికను రూపొందించుకుని గందరగోళం, తొక్కిసలాటకు తావులేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. పట్టాలకై ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుంటారన్నారు. అయితే వారిలో అర్హులకు గుర్తింపు ప్రక్రియ అనంతరం మిగిలిన వారికి తగిన కారణాలను వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా రెవెన్యూ అధికారులు వివరించాలన్నారు. సుమారు 15 రోజుల సమయం ఉన్నందున మరొకసారి లబ్దిదారుల పరిశీలన కార్యక్రమం చేసి ఇంకనూ అర్హత ఉన్నట్లయితే వారికి కూడా అందించాలనన్నారు. ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. వివాదాస్పదంకాని భూమి అయి ఉండి అర్హత ఉన్నట్లయితే పట్టా ఇవ్వాలని సాంకేతికతపై పూర్తిగా అధారపడవద్దని కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు.

బోట్ రేసింగ్‌కు అసాధారణ భద్రత
* వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు * సీసీ కెమెరాలతో నిరంతర నిఘా * సీపీ ద్వారకాతిరుమలరావు
విజయవాడ (క్రైం), నవంబర్ 15: దేశంలో రెండోసారి జరుగుతున్న అంతర్జాతీయ ఎఫ్ 1 హెచ్ 2ఓ-2018 బోట్ రేసింగ్ పోటీలకు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. గతంలో తొలిసారిగా ముంబయిలో 2004లో తొలిసారి బోట్ రేసింగ్ నిర్వహించారన్నారు. రెండోసారి మన రాష్ట్ర రాజధానిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసుశాఖా పరంగా భద్రత, రక్షణ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కమిషనరేట్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలు పటిష్ట బందోబస్తు భద్రత విధుల్లో పాల్గొంటున్నాయన్నారు. నగరం నుంచి 400 మంది సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుంచి అదనంగా 600 మందిని కేటాయించామన్నారు. అదేవిధంగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఈ ఈవెంట్‌ను నిరంతరం సీసీ కెమేరాల పహరాలో 24/7 భద్రత నడుమ నిర్వహిస్తున్నామన్నారు. బందోబస్తుకు సంబంధించి 15 లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సెక్టార్లుగా విభజించారు. సాధారణ ప్రజల సందర్శనార్థం దుర్గాఘాట్ సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ కింద భాగంలో సుమారు ఐదువేల మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భవానీ ఘాట్‌లో కూడా కొత్తగా నిర్మిస్తున్న జెట్టి సమీపాన మరో ఐదు వేలమంది వీక్షించేలా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాస్‌లు కలిగిన వారికి బెరంపార్కు, పున్నమి ఘాట్లలో సుమారు రెండువేల మంది వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఏడు వేల రూపాయలు చెల్లించి టిక్కెట్ కొన్నవారికి భవానీ ఐలాండ్ నుంచి వీక్షించేందుకు భవానీ తగిన ఏర్పాట్లు చేశామన్నారు. భవానీ ఘాట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన జెట్టి నుంచి ప్రత్యేక బోట్‌లలో భవానీ ఐలాండ్‌కు తీసుకుని వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పున్నమీ ఘాట్ పరిసరాల్లో విఐపి పాస్‌లు కలిగి ఉన్న కార్లకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుందన్నారు. ఇతర వీఐపీలకు భవానీపురం దర్గా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర ఫౌండ్రి రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో, సాధారణ పార్కింగ్‌లను భవానీపురం లారీ స్టాండు, స్వాతి థియేటర్ నుంచి శివాలయం సెంటర్ వరకు ఉన్న రోడ్డు మార్జిన్‌లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా భద్రత దృష్ట్యా ప్రకాశం బ్యారేజీపై ఎలాంటి సందర్శకులను వీక్షించేందుకు అనుమతించడం లేదన్నారు. అత్యవసరం దృష్ట్యా అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను ముఖ్యమైన కూడళ్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. భద్రత దృష్ట్యా వివిధ ప్రదేశాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. విలేఖరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ చంద్రశేఖరరెడ్డి, అడ్మిన్ డీసీపీ జె బ్రహ్మారెడ్డి, క్రైం డీసీపీ బి రాజకుమారి, లా అండ్ ఆర్డర్ డీసీపీ వి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.