విజయవాడ

సందడిగా హ్యపీ సండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 3: అందరూ సుఖసంతోషంతో ఉండాలనే ఆలోచనలతో హ్యపీ సండే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుందని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద హ్యపీ సండే కార్యక్రమం ఆనందమయంగా జరిగింది. హ్యపీ సండేలో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో హ్యపీ సండే కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారికి నచ్చిన క్రీడల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమన్నారు. తూర్పు నియోజకవర్గం పటమటలో హ్యపీ సండే కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శాసనసభ్యులు గద్దెరామమోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో చిన్ననాటి కాలంలో సినిమా చూడటానికి వచ్చే వాళ్లమని, ఇప్పడు ముఖ్యమంత్రి అభిరుచి మేరకు నగరంలో ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాల్లో భాగంగా హ్యపీ సండే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకొనే దిశగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. నగర మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒత్తిళ్ల మధ్య ఎంతో బిజిగా జీవనం కొనసాగిస్తున్నారని, ప్రజలకు ఆహ్లదకరమైన ప్రకృతి వాతావరణంలో హ్యపీ సండే కార్యక్రమం నిర్వహించి ఎవరికీ ఇష్టమైన ఆట వారు ఆడుకునేలా ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల స్పందన పెరిగిందని నగరంలో మరిన్ని చోట్ల హ్యపీ సండే నిర్వహిస్తామని పేర్కొన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నగర పాలక సంస్థ ట్రాన్స్‌ఫార్మరింగ్ విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులను భాగస్వామ్యం చేసి నగరంలో ఫోస్టర్ ఫ్రీ, వాల్ రైటింగ్ ఫ్రీగా తీర్చిదిద్ది డ్రాయింగ్‌లతో ప్రతి ఒక్క కాంఫౌండ్ వాల్‌ను విద్యార్థులచే నచ్చిన విధంగా తీర్చిదిదేందుకు అవసరమైన మెటీరియల్‌ను అందిస్తామని విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.