కృష్ణ

20లోగా పుష్కర పనులు పూర్తయ్యేలా కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులు ఈనెల 20లోగా పూర్తిచేసేలా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని కృష్ణా పుష్కరాలకు, ప్రత్యేక అధికారిగా నియమించిన బి.రాజశేఖర్‌కు జిల్లా కలెక్టర్ బాబు.ఎ వివరించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్కరాలపై వివరిస్తూ ఆగస్టు 12 నుండి 23 వరకు నిర్వహించే పుష్కరాలకు అన్ని శాఖలకు సంబంధించిన పనులు 24 గంటలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి 3.5 కోట్ల మంది పుష్కర యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగినట్లు ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు. నగర పరిధిలో 4ఘాట్లు, రూరల్ పరిధిలో 69ఘాట్లతో కలిపి మొత్తం 73ఘాట్లలో నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, దేవాదాయ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు సంబంధించిన సుమారు 959 పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ వివరించారు. పుష్కరాల్లో యాత్రికులను అన్ని వౌలిక వసతులతో సౌకర్యాలు కల్పించిన పుష్కరనగర్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలో 15 పుష్కర నగర్‌లతో కలిపి మొత్తం 39 పుష్కర్‌నగర్‌లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలపై అధికారులతో గత సంవత్సరం నవంబర్ 24న తొలి సమావేశంలో ప్రారంభించి ఇప్పటి వరకు 12 సమీక్షా సమావేశాలు నిర్వహించామని ఎప్పటికప్పుడు శాఖల పనులను సమీక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. సమావేశంలో నగర మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు.