విజయవాడ

ప్రజల సంతృప్తి నూరు శాతం నమోదు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 9: ప్రతి నెల మొదటి వారంలోగా నిత్యావసర సరుకులను కార్డుదారులకు అందించి ప్రజల సంతృప్తిస్థాయి నూరుశాతం నమోదుకావడంలో డీలర్లు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం సూచించారు. నగరంలోని భవానీపురం చౌకధరల దుకాణం-4ను ఆదివారం కలెక్టర్ లక్ష్మీకాంతం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యావసర వస్తువుల స్టాక్ రిజిస్టర్‌ను, సరుకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రతినెల 10 లోగా కార్డుదారులందరికీ సకాలంలో సరుకులు అందించాలని తూకం సరిగా ఉండాలని ఆదేశించారు. రెండో వారంలో క్రిస్మస్ సంక్రాంతి కానుకలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ-పోస్ మిషన్లలో సాంకేతిక ఇబ్బందులు వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్డుదారులకు సాంకేతిక కారణాలు చూపి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కార్డుదారులతో స్నేహపూర్వకంగా మర్యాద వ్యవహరించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్ధపై 90శాతం పైగా ప్రజల సంతృప్తి స్థాయి జిల్లాలో నమోదు అవుతుందని, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దానిని నూరు శాతం నమోదుకు తీసుకురావాలన్నారు.

నోవాటెల్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం
పటమట, డిసెంబర్ 9: విజయవాడలోని వినాయక్ థియేటర్ ఎదురుగా భారతీనగర్‌లో నూతనంగా నిర్మించిన నోవాటెల్ వరుణ్ 5 స్టార్ డీలక్స్ హోటల్‌ను ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిథుల ఆనందమే ధేయ్యంగా వరుణ్ గ్రూపు యాజమాన్యం నోవాటెల్‌ను నిర్మించటం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అధునికంగా హోటల్‌లో 227 గదులు, 4 రెస్టారెంట్లు, 10 వేల చదరపు అడుగుల సమావేశ మందిరాలు, 200 మీటర్ల వాకింగ్ ట్రాక్, ఒలంపిక్స్ ప్రమాణాలతో 45 మీటర్ల ఈతకొలను అతిధులకు అందుబాటులో తెవటం గొప్ప విషయమని అందుకు వరుణ