విజయవాడ

సెలవులు పెడతాం.. పంపిణీ నిలిపేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 9: తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి ఇచ్చి రోజులు గడుసున్నా వాటిని పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ జాయింట్ యాక్షన్ కమీటీ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తు రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్స్ అందరూ మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని తీర్మానించారు. నగరంలోని గవర్నర్‌పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏపీ రాష్ట్ర రేషన్ డీలర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా అమోదించారు. గత నెల 22న రాష్ట్రంలో రేషన్ డీలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ 11 డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం మంత్రికి అందించామని, 22రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కనీస స్పందన రాలేదన్నారు. డిసెంబర్ 16నుండి రాష్ట్ర రేషన్ డీలర్లు మూకుమ్మడి సెలవులోకి వెళ్లాలని తీర్మానించారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు సమస్యలు పరిష్కారమయ్యే వరకు పంపీణీ చేయకుడాదని నిర్ణయించారు. జనవరి నెలకు సంబంధించిన సరుకులకు సంబంధించిన చలాన చెల్లించకూడదని తీర్మానించారు. 11న ఎమ్మార్వోలకు సెలవులపై సమాచారం ఇవ్వాలన్నారు. 16న అన్ని ఎంఆర్‌ఓ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని తీర్మానించారు. 18న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డీలర్లు మానవహారంగా ఏర్పడి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈనెల 20న విజయవాడలోని సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 28500 మందితో మహాసభను నిర్వహించాలని నిర్ణయించారు. ఛలో విజయవాడ పేరుతో భారీ ఎత్తున రేషన డీలర్లు పాల్గొనాలని తీర్మానించారు. సమావేశ తీర్మాన వివరాలను ఐకాస సమన్వయకర్తలు దివిలీలా మాధవరావు, బూగలు వెంకటేశ్వరారవులు ఆదివారం విలేఖరులకు తెలిపారు.

బీసీలను నయవంచన చేస్తున్న బాబు
* ఆదరణలో అంతులేని అవినీతి, నాసిరకం పనిముట్లు * వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి
విజయవాడ(సిటీ), డిసెంబర్ 9: రాష్ట్రంలో ఉన్న బీసీలను సీఎం చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విమర్శించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు నమ్మకద్రోహం చేస్తున్న చంద్రబాబు బీసీల ద్రోహిగా చరిత్రలో మిగలడం ఖాయమన్నారు. చంద్రబాబు, టీడీపీ చేస్తున్న మోసాలపై ఈనెల 20 తేదీన పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదరణ పథకంలో అవినీతి, బీసీ నేతలను చంద్రబాబు అవమానిస్తున్న తీరు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యంపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. బీసీ గర్జన నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో జయహో బీసీ అంటూ చంద్రబాబు నయవంచనకు దిగుతున్నారన్నారు. మైనారిటీలను నాలుగున్నరేళ్లుగా విస్మరించిన చంద్రబాబు ఇటీవల నారా హమారా అని పెట్టారన్నారు. బీసీ వర్గాలన్నీ చంద్రబాబు నయవంచనను గమనిస్తున్నాయని, బీసీలను వాడుకుంటూ వారిని కూరలో కరివేపాకులా చూస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయిబ్రాహ్మణుడైన సుమ్రమణ్యం అనే వ్యక్తిని టీడీపీ సభ్యత్వం తీసుకోమని అడిగారాని తీసుకోనందుకు ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని అవమానించిన తీరు ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. పనిముట్లు ఇవ్వడం కోసం పెట్టిన ఆదరణ అని పెట్టి బీసీలకు నాసిరకం పనిముట్లు ఇస్తున్నారని, అవికూడా కమీషన్లు తీసుకుని ఇస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు పార్టీ బీసీ రాష్ట్ర కార్యవర్గం, బీసీ అధ్యయన కమిటీ సమావేశం జంగా కృష్ణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలుకు చెందిన బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ రూపొందించిన 2019 క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.