విజయవాడ

ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 9: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు వారికి సకాలంలో చెల్లింపులు జరపాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ గొల్లపూడి మార్కెట్‌యార్డులో ఆదివారం కలెక్టర్ లక్ష్మీకాంతం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతుల నుండి 9 లక్షల 30వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా రైతులకు చెల్లింపులు జరిపామన్నారు. ఈ ఖరీఫ్‌లో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందని ప్రతి గింజ కొనుగోలు చేసి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను రైతులకు చెల్లిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దళారులు మధ్యవర్తుల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గోనెసంచులు, టర్ఫాలియన్‌లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా కొనుగోలు కేంద్ర నిర్వహకులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
తేమశాతాన్ని పరిశీలించిన కలక్టర్
కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తేమను కలెక్టర్ లక్ష్మీకాంతం స్వయంగా పరిశీలించారు. తేమశాతంపై రైతులకు అవగాహన కల్పించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలు, కనీస మద్దతు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్న ఆయన రైతుల సమాధానంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉంన్న పల్లపు ప్రాంతాన్ని మెరక చేసే పనులు త్వరితగతిన చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను కలెక్కర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. రైతులు తాము ధాన్యం ఆరబెట్టుకొనేందుకు స్థలం సరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే రూ.46 లక్షల మెరక ప్రతిపాదనను మార్కెటింగ్ శాఖ ఉన్నత అధికారులతో ఫోనులో మాట్లాడి అనుమతులను తీసుకున్నారు.

పట్టిసీమ దిగుబడితో రైతుల్లో ఆనందం
* మంత్రి దేవినేని ఉమా
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 9: పట్టిసీమ ఎత్తిపోతల పథకం కింద డెల్టా పొలాలకు నీరు అందటంతో దిగుబడి పెరగటంతో పాటు రైతులు ఆనందంతో ఉన్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని ఈలప్రోలు గ్రామంలో గ్రామదర్శిని - గ్రామ వికాస్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడు జీ కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు మొదటి గేటు ఏర్పాటు చేసేందుకు ఈ నెల 17వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారని అన్నారు. పోలవరం పూరె్తైతే రైతులు మూడు పైర్లు పండించుకునే సాగునీరు, తాగునీరు, విద్యుత్ సాధించటానికి ఉపయోగపడుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి డెల్టా పొలాలకు సాగునీరు అందితే ఎకరాకు 35 నుంచి 40 వరకు ధాన్యం దిగుబడితోపాటు దాళ్వాకు నీరు రానుందన్నారు. తాను గత 19 సంవత్సరాల నుంచి కన్న కల నెరవేరుతుందని ఇది ఒక గిన్నిస్ రికార్డు కానుందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఈ నెల నుంచి 763 మందికి పెన్షన్‌లు ఇస్తున్నామని అన్నారు. జయహో బీసీ గోడపత్రిక, సీసీ రోడ్లు ప్రారంభించారు. జిల్లా పరిషత్ సభ్యులు రాధా, జంపాల సీతారామయ్య, యు లక్ష్మణరావు, పెద్దబాబు, సాంబయ్య, మాబుసుభాని తదితరులు పాల్గొన్నారు.