విజయవాడ

ఆంధ్ర, రైల్వేస్, గోవా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 10: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ గ్రూప్-ఏ పోటీల్లో సోమవారం ఆంధ్ర, రైల్వేస్, గోవా జట్లు విజయం సాధించాయి. మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో మహారాష్ట్ర, గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గోవా జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జట్టులో సంజుల నాయక్ 45 పరుగులు చేయగా, నిఖిత మాలిక్ 43 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 47.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. జట్టులో తేజాల్ 45 పరుగులు, పూనమ్ 35 పరుగులు, అనూజపాటిల్ 28 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో పంజాబ్, రైల్వేస్ జట్లు తలపడగా 9 వికెట్ల తేడాతో రైల్వేస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. జట్టులో తానియా భాటియా 33 పరుగులు, నీలమ్ 31 పరుగులు చేశారు. 110 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 28.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. జట్టులో శే్వతజాదవ్ 44 పరుగులతో నాటౌట్‌గా నిలువగా స్నేహరాణా 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. గుంటూరులో జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ జట్లు తలపడగా 2వికెట్ల తేడాతో ఆంధ్ర విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌ఘడ్ జట్టు 44 ఓవర్లలో 93 పరుగులకు అలౌటైంది. జట్టులో మన్‌ప్రీత్ కౌర్ 39 పరుగులు చేసింది. 94 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆంధ్ర జట్టు 36.1 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. జట్టులో కే అంజలీ శర్వాణి 22 పరుగులు, ఎస్ హిమబిందు 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

ఇసుక ట్రాక్టర్ల రొదపై నిరసన
* నిలిపివేసిన ఈడుపుగల్లు వాసులు
కంకిపాడు, డిసెంబర్ 10: వందలకొద్దీ ఇసుక ట్రాక్టర్లు ఈడుపుగల్లు మీదుగా ప్రయాణిస్తూ తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని ఈడుపుగల్లు గ్రామస్థులు సోమవారం ఇసుక ట్రాక్టర్లను నిలిపివేసి నిరసన తెలిపారు. నిత్యం ఇసుక ట్రాక్టర్లు రాకపోకల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి బయటకు రావాలంటేనే భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ నిచిపోయి ప్రమాదాలు బారినపడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకదాని వెనక మరోటి వందల సంఖ్యలో ట్రాక్టర్లు తెల్లవారుఝాము నుంచి అర్ధరాత్రి వరకు అతి వేగంగా తిరుగుతుండటంతో రోడ్డు మీద వెళ్లే వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ విపరీతమైన టేప్ రికార్డులు పెట్టి శబ్దాలు చేస్తూ ప్రయాణికులు హడలిపోయేలా ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయని వాపోయారు. నిత్యం వందల కొద్దీ ట్రాక్టర్లు గన్నవరం, హనుమాన్ జంక్షన్ , నూజివీడు ప్రాంతాలకు ఇసుక తరలిస్తూ నిబంధలను విరుద్ధంగా ప్రయాణం సాగిస్తున్నాయన్నారు. ప్రతి నిత్యం పునాదిపాడు కాటన్ సర్కిల్‌లో పోలీసులు నిఘా పెట్టి ఫైన్‌లు రాయటంతో డ్రైవర్ లైసెన్స్‌లు, ట్రాక్టర్ల సర్ట్ఫికెట్‌లు సరిగాలేక ఈడుపుగల్లు, ఉప్పులూరు రోడ్డు శ్రేయస్కరంగా భావించి ఈ మార్గంలో ప్రయాణించటానికి మొగ్గు చూపుతున్నారని గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించి వారి కోరిక మేరకు వాహనాలు నిబంధనల ప్రకారం నడిచేలా ఈడుపుగల్లు సెంటర్‌లో పోలీస్ నిఘా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు.