విజయవాడ

దుర్గమ్మకు పసిడి వడ్డాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 10: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ ఆభరణాల జాబితాలోకి సోమవారం ఒక పసిడి వడ్డాణం వచ్చి చేరింది. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన రమణ రాయన కార్తికేయ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 65గ్రాముల తూకంతో రూ.2లక్షల, 10వేలు ఖరీదు చేసే పసిడి వడ్డాణాన్ని దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మకు అందచేశారు. పసిడి వడ్డాణం దాతతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వచ్చారు. ఈసందర్భంగా వీరికి ఆలయాధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి ఆశీర్వాద మండపంలో అర్చకులు చేత దివ్య ఆశీస్సులిప్పించారు. ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక సమయాల్లో ఈ పసిడి వడ్డాణాన్ని అమ్మవారికి అలకరించనున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.

సోనియాపై ప్రధాని వ్యాఖ్యలు గర్హనీయం
* మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 10: ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మహిళాలోకాన్ని కించపర్చేలాగానే కాకుండా మహిళలపై ఆయనకున్న వ్యతిరేకతను చాటుతున్నాయని సిటీ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాణిమేకల సతీష్ అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియా గాంధీపై మొదట నుంచి విషం చిమ్ముతున్న బీజేపీ, నేడు ప్రధానిగా ఉన్న మోదీ సోనియా గాంధీని ఉద్దేశించి వృద్ధాప్య పెన్షన్ ఇస్తానంటూ దిగజారుడు మాటలు మాట్లాడటం ఆయన రాజకీయ అనైతికతకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి అనైతిక ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ల జోసఫ్, కే భాస్కర్, నవీన్, నాగ, నాని, గణేష్ డూండీ, నాగేశ్వరరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.