విజయవాడ

అడ్డగోలుగా భవనం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 10: స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 49వ డివిజన్ పాత రాజరాజేశ్వరీపేటలో నిర్మిస్తున్న డ్రైన్ పనులు మరో వివాదానికి తెరదీసింది. పేట మెయిన్ రోడ్డులో నిర్మిస్తున్న డ్రైన్ పనులకు అడ్డమంటూ స్థానిక నివాసి ఎల్లాల లక్ష్మీకి చెందిన నివాస గృహం మొత్తం కూల్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు జీ ప్లస్ -1 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన ఘటనను నిరసిస్తూ బాధితులు సోమవారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో సిటీ ప్లానర్ ఆఫీస్ గుమ్మం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. డ్రైన్ అడ్డంగా ఉన్న గోడను తొలగించాల్సిన అధికారులు ఇంటి మొత్తాన్ని కూల్చివేయడం దారుణమని విలపిస్తున్న బాధితులు తమకు కమిషనర్ నివాస్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల దుశ్చర్యలను ఖండిస్తూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉత్తమ్‌చంద్ భండారి బాధితులకు అండగా నిలిచి బాధితులతోపాటు ఆందోళన చేపట్టారు. సీపీ గుమ్మం ఎదురుగా నేల మీద కూర్చొని బైఠాయించిన ఫ్లోర్ లీడర్ భండారి మాట్లాడుతూ పైసా పైసా కూడగట్టుకుని నిర్మించుకున్న ఇంటిని అధికారులు ఏకపక్షంగా తొలగించడం అన్యాయమని, స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులతో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న నగర ప్రజానీకం, ఇప్పుడు ఇళ్లను కూడా తొలగిస్తున్న వైనం గర్హనీయమన్నారు. తక్షణమే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయంపై ఆందోళన మరింత తీవ్రతరం చేసి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.