విజయవాడ

స్వచ్ఛ సర్వేక్షన్ 2019లో మొదటి ర్యాంక్ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 11: స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా నగర పరిధిలోని పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణలో మొదటి ర్యాంకు సాధనకు కృషి చేయాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. మంగళవారం వీఎంసీ కౌన్సిల్ హాల్లో ఇంజినీరింగ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం అభివృద్ధిపర్చిన మరుగుదొడ్లలో నాటి సౌకర్యాలు, వసతులన్నీ ఉన్నాయా లేదాన్న విషయంపై సమగ్ర పరిశీలన చేయాలన్నారు. వీఎంసీ స్కూల్స్‌లో ఇంకా మెరుగుపర్చాల్సిన మరుగుదొడ్లకు సంబంధించిన చర్యలను తక్షణమే తగు చర్యలు తీసుకుని ఆధునీకరించాలన్నారు. మరుగుదొడ్ల సివిల్, ఎలక్ట్రికల్, నీటి సరఫరా, బకెట్, మగ్, డస్ట్ బిన్ తదితర సౌకర్యాలన కల్పనలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలోన 3 సర్కిల్స్ పరిధిలో గుర్తించిన 18 టాయిలెట్లను మోడరన్ టాయిలెట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టాయిలెట్లలో ఒకదానిని బాత్‌రూమ్‌గా ఆధునీకరించాలని, ప్రతి టాయిలెట్స్‌లో వాష్ బేసిన్, పుష్ బటన్ టైప్ ట్యాప్‌లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో బాలికల, మహిళలకు ప్రత్యేకంగా శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైనచోట మొబైల్ యూరినల్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో సీఈ పి ఆదిశేషు, అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లు వివేకంతో ఇచ్చిన తీర్పు ఇది
* వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్
విజయవాడ (సిటీ), డిసెంబర్ 11: రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఓటర్లు వివేకంతో ఆలోచించి మంచి తీర్పునిచ్చారని వైసీపీ వైద్య విభాగం అద్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సూర్యారావు పేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలతో మతాలను రెచ్చగొట్టి మాయా కూటములు కట్టే వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ తీర్పు దేశానికి శుభ పరిణామమని, బీజేపీ పాలనను తిరస్కరించిన ఓటర్ల తీర్పు 2019 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయన్నారు. 3 రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చారిత్రాత్మక తప్పిదం చేసిందన్న విషయం రుజువైందన్నారు. టీడీపీ వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిందన్నారు. చంద్రబాబు అవకాశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. తెలంగాణ ఓటర్ల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మతతత్వ బీజేపీ, అవకాశవాద మహాకూటమికి గుణపాఠం చెప్పిన తెలంగాణ ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.