విజయవాడ

శాస్ర్తియ విద్యాబోధనకు ఆధునికత జోడింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: విద్యార్థులకు శాస్ర్తియ విద్యాబోధనతో ఆధునికతను జోడించి పాఠ్యాంశాలను సులభంగా విశదీకరించే రీతిలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. పటమట గోవిందరాజు ధర్మశాల ట్రస్టు నగరపాలక పాఠశాలలో ప్రవాసాంధ్రుల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 440కు పైగా ప్రభుత్వ పాఠశాలల డిజిటలీకరణలో భాగంగా డిజిటల్ తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 260కు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను పూర్తి చేశామని, ఈ మాసాంతానికి నూరుశాతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. విద్యాధిక దేశంగా రూపొందితే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్యాధిక సామ్రాజ్యాన్ని నెలకొల్పే విధంగా జిల్లాలోని అన్ని పాఠశాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. సుస్థిర అభివృద్ధి చెందిన దేశాలు ప్రగతికి చిహ్నాలుగా ఉంటాయని, అభివృద్ధి, సంక్షేమం మనిషికి రెండు కళ్లు లాంటివన్నారు. మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అని, దీనిలో భాగంగా విద్య, ఆరోగ్యం అందరికీ అందాలన్నారు. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన ప్రజల సంతృప్త స్థాయి నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానాన్ని పొందిందన్నారు. జిల్లాలో 84 శాతం పైగా ప్రజలు అభివృద్ధి, సంక్షేమం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, టాయిలెట్లు, ప్రహరీ గోడలు, ఆటస్థలాలు, ఫర్నిచర్ వంటి వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవసరమైనచోట అదనపు తరగతి గదులు నిర్మస్తున్నామని, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్చువల్ క్లాస్‌రూమ్స్ బోధన పట్ల విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారన్నారు. సైన్స్‌ను టెక్నాలజీతో జోడిస్తే అంతులేని అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కష్టపడి అనుకున్నది సాధించాలని సూచించారు. కాలాన్ని వృథా చేయవద్దని, అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. చిన్ననాటి నుండి స్పష్టమైన విజన్ నిర్దేశించుకుని భాషపై పట్టు సాధించాలని, మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు బోధించారు. పాఠ్యాంశాలను విద్యార్థుల హృదయాన్ని తాకేవిధంగా ఉపాధ్యాయులు బోధించాలని, పాఠం అర్థమయ్యే రీతిలో స్పష్టంగా బోధించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు ఆఫీసరు కేడీవీఎం ప్రసాదబాబు, అల్బని ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ నిడమనూరు, స్థానిక కార్పొరేటర్ కె రమాదేవి, స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ నజీర్ హుస్సేన్, డిప్యూటీ డీఈవో కె దుర్గాప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డిజిటల్ క్లాస్ రూమ్‌లకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న కలెక్టర్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ప్రైజరుపేటలో ఆకట్టుకుంటున్న క్రిస్మస్ స్టార్
పాతబస్తీ, డిసెంబర్ 11: పాతబస్తీలో క్రిస్మిస్ వేడుకల సందడి మొదలైంది. ప్రతి ఏడాది తెలుగు బాపిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈసారి గతం కంటే ఘనంగా డిసెంబర్ మొదటి వారంలోనే సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎర్రకట్ట రైల్వే బ్రిడ్జి వద్ద నుండి చిట్టినగర్ సెంటర్ వరకూ రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రైజరుపేట యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా కొలగాని అశోక్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కళ తప్పిన సొరంగం!
పాతబస్తీ, డిసెంబర్ 11: చిట్టినగర్‌లోని సొరంగం సోయగాలకు గ్రహణం పట్టింది. రంగులు హంగుల విద్యుత్ దీపాలతో నగరవాసులను మురిపించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సొరంగం నూతన శోభను సంతరించుకోవడంతో చీకటి పడగానే దాని సోయగాలను తిలకించడానికి నగరవాసులు బారులుతీరిన సందర్భాలున్నాయి. అలాంటి ప్రాధాన్యత సంతరించుకున్న సొరంగం నేడు కాంతివిహీనంగా వెలుతురు లేకుండా మసకబారింది. సంబంధిత అధికారులు సొరంగానికి పూర్వవైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు.

వేదవతి ప్రాజెక్టు సామర్థ్యం పెంచండి
* సీఎంకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
విజయవాడ(సిటీ), డిసెంబర్ 11: వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోనే నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూచించారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హాలహర్వి, మొలగపల్లిల్లో వేదవతి ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న రెండు రిజర్వాయర్ల గురించి మంగళవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తీవ్ర కరవు కాటకాలతో అల్లాడుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 80 వేల ఎకరాలకు సాగునీరు, 253 గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మోలగపల్లి వద్ద 4 టీఎంసీలు, హాలహర్వి వద్ద 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ రెండు జలాశయాలకు రూ. 1942.80 కోట్లు ఖర్చు అవుతుందని జనవనరులశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిందన్నారు. ప్రస్తుతం మొలగపల్లి వద్ద 1.02 టీఎంసీలు, హాలహర్వి వద్ద 2.02 టీఎంసీలకు సంబంధించి జలవనరులశాఖ సర్వే చేసి నివేదిక పంపిన నేపథ్యంలో అధిక వ్యయం సాకుతో రెండు జలశయాలకు కలిపి కేవలం 3 టీఎంసీలకు కుదించి ప్రణాళికలు సిద్ధం చేయడం సమంజసం కాదన్నారు.

డీడీలు ఇచ్చిన వారి వివరాల నమోదు వేగవంతం
* వీఎంసీ కమిషనర్ నివాస్
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 11: ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహాలు మంజూరై లబ్ధిదారుని వాటా కింద చెల్లించాల్సిన నగదు డీడీలు అందజేసిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాయలంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏపీ టిట్కో సిబ్బంది చేపట్టిన నమోదు ప్రక్రియను పరిశీలించిన కమిషనర్ నివాస్ పలు సూచనలు చేశారు. లబ్ధిదారులు పొందుపర్చిన అప్లికేషన్ ఆధార పత్రాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్న ఆయన మరల వారికి ఫోన్ చేసి సమాచారం తీసుకోకుండా మన వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్న కమిషనర్ విధి నిర్వహణలో ఎటువంటి అలక్ష్యం వహించకుండా బాధ్యతతోనే కాకుండా నిజాయితీగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కమిషనర్ జనరల్ డి చంద్రశేఖర్, డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.