విజయవాడ

ఆక్రమణకు గురవుతున్న ఖాళీ స్థలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆక్రమణలకు గురవుతున్న వీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభవృద్ధిపర్చి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు స్థానికులు కోరారు. ఈమేరకు బుధవారం మేయర్ కోనేరు శ్రీ్ధర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించిన కాలనీ వాసులు ప్రజాప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఎంతో విలువైన ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటుచేస్తే ఈ ప్రాంత వాసులకు పార్కు కొరత తీరుతుందని, స్థలం ఖాళీగా ఉండటంతో కొంతమంది దానిని ఆక్రమించేందుకు ఉపక్రమిస్తున్న వైనాన్ని గుర్తించాలన్నారు. స్థానికుల వినతికి స్పందించిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆక్రమణలను నియంత్రించి స్థలంలో అందమైన ఆహ్లాదకరమైన పార్కును అభివృద్ధిపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.