విజయవాడ

పాలనా ప్రగతిపై సమీక్షకు సాంకేతికత దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: పాలనాపరమైన ప్రగతిని సమీక్షించేందుకు సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు పోలీసు సేవలు వేగవంతంగా అందించవచ్చని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. పోలీసు కమిషనరేట్‌లో సెంట్రలైజ్డ్ వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పౌర సంబంధ సేవలు మరింత విస్తృతపరచడానికి పోలీసు కమిషనర్ కార్యాలయంలో తొలిసారిగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభం సందర్భంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలెక్టర్, సీపీ సమావేశమయ్యారు. కమిషనరేట్‌లోని పలు పోలీస్టేషన్ల హౌసాఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ వ్యవస్థ జిల్లా యంత్రాంగం సౌజన్యంతో ఏర్పాటు చేశారు. నగరంలోని 22 పోలీస్టేషన్లతోపాటు ముగ్గురు డీసీపీ, కమిషనర్ కార్యాలయాలతో కలిపి మొత్తం 26 యూనిట్లను కలుపుతూ ఈ సెంట్రలైజ్డ్ వీడియో కాన్ఫరెన్స్ విధానం అనుసంధానించారు. ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష ప్రగతిని రికార్డింగ్ చేసుకునే సౌలభ్యంతో పాటు చాటింగ్, ఫైల్స్ షేరింగ్, లైవ్ పీపీటీ షేరింగ్ తదితర సదుపాయాలు ఇందులో పొందుపర్చారు. పోలీసు కమిషనరేట్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పోలీసు కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే అందుకు కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పిస్తూ సహకారమందించిన కలెక్టర్‌కు నగర పోలీసుశాఖ తరుఫున సీపీ కృతఙ్ఞతలు తెలియచేశారు. ప్రతి నెలా కమిషనరేట్‌లోని అన్ని పోలీసు అధికారులతో నిర్వహించే నేర సమీక్షకు ఇక నుంచి అధికారులు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థ ద్వారా నేరుగా టెలీకాన్ఫరెన్స్‌లో సీపీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ల వారీగా సమీక్ష నిర్వహించవచ్చు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరించేందుకు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటూ పౌర సంబంధ సేవలు మరింత విస్తృత పర్చడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది. పారదర్శకత, జవాబుదారీతనానికి మరింత చోటు కల్పిస్తూ ఈ వ్యవస్థ సత్ఫలితాలు సాధించనుంది. వ్యవస్థను ప్రారంభించిన కలెక్టర్ ఈ సందర్భంగా పోలీసు అధికారులనుద్దేశించి మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ విధానం వల్ల గతంలో మాదిరిగా అందరూ ఒకేచోట ఉండి ఫిజికల్‌గా సమీక్షలు నిర్వహించే పద్ధతికి స్వస్తి చెప్పాలన్నారు. ప్రస్తుతం మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా నూతన ఆధునిక సాంకేతిక పరిఙ్ఞనాన్ని జిల్లాలో విరివిగా ఉపయోగించడం ద్వారా చాలా ప్రగతి సాధించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 440 పాఠశాలలను డిజిటలైజేషన్ చేశామని, తద్వారా ఎన్నారైలు జిల్లాలో పాఠశాలలను సందర్శించడం గర్వకారణమన్నారు. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షలు నిర్వహించేందుకు ముఖ్యంగా సజావుగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీడియో కాన్ఫరెన్స్ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రైం డీసీపీ బీ రాజకుమారి, డీసీపీలు వెంకట అప్పలనాయుడు, డాక్టర్ గజరావు భూపాల్, ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్‌రెడ్డి, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఉదయరాణి, అదనపు డీసీపీ, ఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.