విజయవాడ

టిబెట్ సమస్య ప్రపంచానికి తెలియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 21: చైనా ద్వంద్వ వైఖరిని అనుసరిస్తూ టిబెట్‌పై దాడి చేస్తోందని టిబెటియన్ పార్లమెంట్ డెప్యూటీ స్పీకర్ ఆచార్య ఏషి అన్నారు. సోమవారం పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా ఈ దాడులు చేస్తోందన్నారు. టిబెట్ ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదికపై చర్చించడానికి మేధావులతో కలిసి చర్చావేదికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులోభాగంగా మంగళవారం సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో చర్చావేదిక ఏర్పాటు చేశామన్నారు. టిబెట్‌లో విద్య, వైద్యం, గణిత శాస్త్రానికి మూలాలు అన్నీ భారతదేశం నుంచే ఉన్నాయన్నారు. 60 సంవత్సరాలుగా తమకు భారత్ ఎంతో సహాయం చేస్తోందని, సరిహద్దులను ఆక్రమించుకుని చైనా టిబెట్‌కు అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనా దురాగతాల వల్ల గడిచిన 60 సంవత్సరాలలో 12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆ దేశం టిబెట్‌లో మానవ హక్కులను హరిస్తోందని ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో 5వేల మందిని అరెస్ట్ చేసి చైనా జైళ్లలో బంధించారన్నారు. టిబెట్ వైద్య సూత్రాలను చైనా కాపీకొట్టి దుర్వినియోగం చేస్తోందని ఏషి ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో టిబెట్ పార్లమెంట్ సభ్యులు డాన్ డుప్ టాషి, కడక్ నుడూప్ సోనమ్, తదితరులు పాల్గొన్నారు.

పోరంకికి జిల్లాస్థాయి ఉత్తమ స్మార్ట్ విలేజ్ పురస్కారం
పెనమలూరు, జనవరి 21: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2019 జిల్లా స్థాయి ఉత్తమ స్మార్ట్ విలేజ్ పురస్కారాన్ని పోరంకి గ్రామ మాజీ ఉప సర్పంచ్ అనుమోలు ప్రభాకరరావు అందుకున్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం చైర్మన్ జి నాంచారయ్య, జిల్లా పరిషత్ సీఈవో షేక్ సలాం చేతులమీదుగా సోమవారం ఆయన ప్రశంసాపత్రం కూడా అందుకున్నారు. స్మార్ట్ విలేజ్‌గా పోరంకి గ్రామాన్ని తీర్చిదిద్దడంలో గతంలో ఉప సర్పంచ్‌గా ప్రభాకరరావు చేసిన కృషికి ఈ పురస్కారం లభించింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా చేసిన సేవలకు లభించిన అవార్డు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. మరింతగా గ్రామాభివృద్ధి, సేవ చేయడానికి ఈ పురస్కారం ఇంకా స్ఫూర్తి, శక్తిని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం స్ఫూర్తితో ప్రజలు కూడా ముందుకొచ్చి గ్రామాభివృద్ధికి నడుం బిగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోరంకి మాజీ సర్పంచ్ వేమూరి స్వరూపరాణి, ఎంపీటీసీ కోలా శివశంకర ప్రసాద్ పాల్గొన్నారు.