విజయవాడ

భవిష్యత్ కార్యాచరణపై వంగవీటి రాధా కసరత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: వైకాపాకు రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవటంలో తలమునకలయ్యారు. ఏలూరు, ఇతర నగరాల నుంచి బస్సుల్లో వందలాది మంది రంగా అభిమానులు తరలివస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. రాధా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతు ఇస్తామని చెప్పి వెళుతున్నారు. మరోవైపు విజయవాడ నగరపాలక సంస్థలో రాధా వర్గానికి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం జరగనున్న బడ్జెట్ సమావేశంలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని వారు మేయర్‌కు విజ్ఞప్తి చేశారు.

మూడు చక్రాల వాహనాలకు పన్ను రాయితీ పరిశీలిస్తాం
* రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ, జనవరి 21: పేద, మధ్యతరగతి ప్రజలకు స్వయం ఉపాధి కార్యక్రమాల నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు ప్యాసింజర్ ఆటోలకు, మూడు చక్రాల రవాణా వాహనాలకు, వ్యవసాయం కోసం ఉపయోగించే ట్రాక్టర్, ట్రైలర్లకు పన్ను రాయితీ అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిస్తామని మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు చెప్పారు. లబ్బీపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం రవాణా శాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ మణికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం, జోనల్ నాయకులు మంత్రిని కలిశారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్-2 రూపొందించిన 2019 గోడకాలమానిని మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉద్యోగులు రూపొందించిన క్యాలెండర్ ఎంతో ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా ఉందన్నారు. ఆటో ప్యాసింజర్ వాహనాలు, మూడు చక్రాల రవాణా వాహనాలు నడిపేవారు ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారని, వారి శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వారు చెల్లించే పన్నుల్లో ప్రోత్సాహకం అందించాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ మణికుమార్, ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాస్, కోశాధికారి ఏ మదాని, ఉపాధ్యక్షుడు కేవీఎస్‌వీ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాకేష్, మధుకర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.