విజయవాడ

పవిత్ర సంగమాన్ని సందర్శించిన నితిన్ గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: నగరంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీలోని పవిత్ర సంగమ ప్రదేశాన్ని సందర్శించారు. గన్నరం విమానాశ్రయం నుంచి ఆయన వెంట వచ్చిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ స్వాగతం పలికారు. ఈసందర్భంగా పోలవరం పనులు జరుగుతున్న తీరును వివరించారు. పోలవరం రెండో డీఆర్‌పీని వెంటనే ఆమోదించి ఇవ్వాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాల్సిందిగా కోరారు. దీనికి మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర జలవనరుల శాఖకు గ్లోబల్ ప్లాటినం అవార్డు రావడం పట్ల మంత్రి దేవినేని ఉమా, అధికారులను ఆయన అభినందించారు. మంత్రి దేవినేని వెంట జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటరీ బృందానికి స్వాగతం

విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం చైర్మన్ డా. కంభంపాటి హరిబాబు, ఇతర సభ్యులకు సోమవారం ఓ హోటల్‌లో కలెక్టర్ బీ లక్ష్మీకాంతం స్వాగతం పలికారు. ఈ కమిటీలో 21మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు, ఐదుగురు అధికారులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.