విజయవాడ

నేటి ఇంజనీర్లకు స్ఫూర్తి ప్రధాత కెయల్ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూలై 15: విద్యార్థి దశ నుండే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన డిజైన్ రూపకల్పన చేసిన డాక్టర్ కెయల్ రావు నేటి తరం ఇంజనీర్లకు ఆదర్శప్రాయుడని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పద్మభూషణ్ డాక్టర్ కెయల్ రావు 114వ జయంతి వేడుకలను నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత ప్రాజెక్టుల రూపకల్పనకు కెయల్ రావు చేసిన సేవలు ఇంజనీర్లకు, రైతులకు స్ఫూర్తిదాయకమన్నారు, ఆనాటి జలవిద్యుత్ శాఖా మంత్రిగా పలు రాష్ట్రాల్లో ఆయన చేపట్టిన ప్రాజెక్టులపై ఆయన చూపిన ఆసక్తిని తెలియజేస్తుందన్నారు. నదుల అనుసంధానంపై తొలిసారిగా ఆయన శ్రద్ధచూపారని చెప్పారు. ప్రపంచంలోనే అతి పొడవైన డ్యాములను రూపొందించడంలో ఆయన కీలకభూమి పోషించినట్లు చెప్పారు. ఆయన స్ఫూర్తితో టిడిపి ప్రభుత్వం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందని, ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టులను 2018 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. దీని కారణంగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కెఎల్ రావు కలలు గన్న నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు చెప్పారు. నేటి విద్యార్థులు క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.