విజయవాడ

ఎమ్మెల్సీ ఓటింగ్ స్లిప్‌లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 19: ఈ నెల 22న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గ ఓటర్లకు చెందిన ఓటు స్లిప్ లు సిద్దమైనాయని ఎన్నికల అధికారి డెప్యూటీ తహశీల్దార్ నాగమణి తెలిపారు. సెంట్రల్ పరిధిలో మొత్తం 11 పోలింగ్ స్టేషన్లు సిద్ధమైనాయని తెలిపిన ఆమె ఓటరు స్లిప్‌లు ఎన్నికల అధికారులు ఓటరు ఇంటికి వచ్చి పంపిణీ చేస్తారని, స్లిప్ రాని వారు ఈనెల 21వ తేదీలోగా వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్‌లో సంప్రదించి స్లిప్‌ను పొందవచ్చన్నారు. అలాగే సీఈవోఆంధ్ర డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ ఆన్‌లైన్లో వివరాలను తెలుసుకోచ్చన్నారు. సెంట్రల్ పరిధిలో గవర్నర్‌పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో 3 పోలింగ్ స్టేషన్లు, ఎస్‌కెపీవీ హిందు హైస్కూల్లో 2 పోలింగ్ స్టేషన్లు, ఏకెటీపీఎం హైస్కూల్లో 4 పోలింగ్ స్టేషన్లు, సింగ్‌నగర్ ఎంకె బేగ్ మున్సిపల్ స్కూల్లో 2 పోలింగ్ స్టేషన్లు కలిపి మొత్తం 11 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశామన్నారు.

మినుము రైతులకు గిట్టుబాట ధర కల్పించాలి
కంకిపాడు, మార్చి 19: ప్రభుత్వం మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు కొనాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. స్థానిక మండేపూడి నాగభుషణ్‌రెడ్డి భవనంలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 3.5 వేల హెక్టర్లలో రైతులు మినుము పంట పండించారని, అకాల వర్షం వల్ల పంట తడిసిపోయి రంగు మారడంతో మినుములు కొనుగోలు చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మినుముకు 5600 గిట్టుబాటు ధరగా నిర్ణయించి కొనుగోలు చేసి అప్పులపాలైన కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో కౌలురైతు సంఘం సభ్యులు పంచకర్ల రంగారావు, వీ జాన్‌మోజెస్, రవి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.