విజయవాడ

బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 22 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితా ప్రకటించిందని, వాటిలో బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట వేశామని పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగాధర్ వెల్లడించారు. ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 132 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 41, ఓసీలకు 49, ఎస్సీలకు 28, ఎస్టీలకు 7, మైనార్టీలకు 7 స్థానాలు కేటాయించామన్నారు. వాటిలో మహిళలకు 11 స్థానాలు, వైశ్యులకు, బ్రాహ్మణలకు ఒకటి చొప్పున కేటాయించామన్నారు. ఇంకా ప్రకటించాల్సిన 43 స్థానాల్లో బీసీలకు 10 నుంచి 15 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనరల్ స్థానాలు ఎస్సీలకు కేటాయించడం కాంగ్రెస్ ప్రత్యేకతగా అభివర్ణించారు. తమ పార్టీ బలహీన, బడుగు వర్గాల పార్టీ అన్నారు. తెలుగుదేశం, వైసీపీ బీసీలకు పెద్దపీట అని ప్రచారం చేసుకున్నాయని, కానీ అవి బీసీలకు కేవలం 38, 41 సీట్లు మాత్రమే కేటాయించాయన్నారు. తాము ఇప్పటికే 41 స్థానాలు ప్రకటించామని, రాబోయే జాబితాలో మరిన్ని సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య పరిరక్షణను హక్కుగా ప్రజలకు కల్పించనుందని చెప్పారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్పొరేట్ హాస్పటిల్స్‌పై నియంత్రణ పెడతామన్నారు. ఆరోగ్య బీమా 5లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పారు. అలాగే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులకు, డ్వాక్రా మహిళలకు రూ. 2లక్షల రుణమాఫీ ఉంటుందన్నారు. కనీస ఆదాయ రేఖను నిర్ణయించి, దానిలోపు ఉండే కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. కనీస ఆదాయ పథకం ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల వద్దకు వెళుతున్నామన్నారు. ప్రత్యేక హోదా రాకుండా ఏఒక్కరూ అడ్డుకోలేరని రాహుల్ గాంధీ తిరుపతి సభలో చెప్పిన మాటను ఈసందర్భంగా డా. గంగాధర్ గుర్తుచేశారు.