విజయవాడ

ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: చంద్రబాబు ప్రజలను ఓటెలా అడుగుతారని జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ అంటున్నారని, చేసిన అభివృద్ధిని చెప్పి ధైర్యంగా నాకు ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. మంగళవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ జగన్‌కు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, జగన్‌పై ఎన్నో కేసులు, ఆరోపణలున్నా సీఎం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బిహార్ నుండి వచ్చిన ఒక డెకాయిట్ ప్రశాంత్ కిషోర్ అని, రాష్ట్రంలో అల్లర్లు జరగాలని చెప్పింది ప్రశాంత్ కిషోర్ కాదా అని ఆరోపించారు. కుట్రలకు పాల్పడేవారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. బిహార్ ప్రజలంటే చంద్రబాబుకు చాలా అభిమానమని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి చావును జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారన్నారు. జగన్ ప్రశాంత్ కిషోర్ మాటలు, సలహాలు విని నట్టేట మునగబోతున్నాడన్నారు. చంద్రబాబుపై పీకే ట్వీట్లు చేయటం మంచిది కాదని, ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. మంగళగిరిలో లోకేష్ గురించి వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో లోకేష్ గెలవబోతున్నారని, కావాలాంటే రాసి పెట్టుకోవచ్చన్నారు. వైఎస్ వివేకానంద హత్యలో జగన్, ఆయన కుటుంబ బండారం బయటపడిందని, ఇంటిదొంగలు బయటకొస్తున్నారని వర్ల రామయ్య చెప్పారు. చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఆదినారాయణ రెడ్డిపై ఆరోపణలు చేసినందుకు జగన్ క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు. జగన్‌కు తెలిసి కూడా ఎందుకు దాచారో చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నేరం చేసిన వారితో పాటు దాచినవారు దోషులు అవుతారని రామయ్య హెచ్చరించారు. జగన్‌కు ఒక అవకాశమిస్తే రాష్ట్ర ప్రజలను వారి మానాన వారిని బతకనిస్తారా ఆలోచించాలని ప్రజలకు రామయ్య విజ్ఞప్తి చేశారు.