విజయవాడ

రూ 185 కోట్లతో వేసవి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి కొరతలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీటికి ఇబ్బందిపడే గ్రామాలు, ఆవాసాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. పశుగ్రాసం, పశువులకు తాగునీటికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రైతులు పశువులను తెగనమ్ముకోకుండా తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. కరవు జిల్లాల్లో ఉపాధిలేక వలస వెళ్లే వారిని గుర్తించి వారికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని నిర్దేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ రూ. 185 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నీటి ఎద్దడికి ఇబ్బంది ఉండే 5784 ఆవాసాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు ప్రస్తుతం ఉన్న బోర్లను లోతు చేయటం, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపటం, వివిధ ప్రైవేట్ నీటి వనరులను లీజుకు తీసుకుని తాగునీటి అవసరాలు తీర్చాలన్నారు. రాష్ట్రంలోని 110 పట్టణాల్లో వేసవి కార్యాచరణ అమలు చేసేందుకు రూ. 155 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కరికల వలవన్ ప్రతిపాదించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ వేసవి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి గ్రామ, వార్డుల వారీ కార్యాచరణ రూపొందించామన్నారు. అంటువ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆశా, అంగన్‌వాడీ, హెల్త్ సబ్ సెంటర్ స్థాయిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 6 కరవు ప్రభావిత జిల్లాల్లో 50వేల హెక్టార్లలో పెసర, మినుము, తదితర అపరాల సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ కరవు జిల్లాల్లో కూరగాయల సాగుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద రూ. 10వేల 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 8వేల 776 కోట్లు ఖర్చు చేసి ఉపాధి కల్పించామన్నారు. కరవు జిల్లాల్లో మరిన్ని పనులు కల్పించడం ద్వారా కూలీల వలసల నిరోధానికి తగిన చర్యలు చేపడతామని వివరించారు. పశు సంవర్థకశాఖ కార్యదర్శి శ్రీ్ధర్ మాట్లాడుతూ కరవు ప్రభావిత జిల్లాల్లో పశుగ్రాసం సరఫరాకు రూ. 54లక్షల 94వేలు అవసరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, రోజుకు 192 నుండి 195 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉందని ఆ శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి సాంబశివరావు, ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, వైసీపీ రెండూ ఒక్కటే
* మండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న
విజయవాడ, మార్చి 22: బీజేపీ, వైసీపీ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని మండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తూ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో నీచ రాజకీయాలకు తెరతీశారన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధ్రీశ్వరి పోటీ చేస్తున్నారని, అదే సమయంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటమే వారి లాలూచీ రాజకీయాలకు నిదర్శనంగా పేర్కొన్నారు. అప్పట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో జగన్మోహనరెడ్డి బీజేపీ, టీడీపీ ఒక్కటేనని ప్రచారం చేశారని గుర్తుచేశారు. మరి ప్రస్తుతం వారు చేస్తుందేమిటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు ఉన్న వారిని కేసీఆర్ అండతో జగన్ బెదిరిస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని వెంకన్న ఆరోపించారు.

వివేక హత్యను పక్కదారి పట్టించేందుకే జగన్ జిమ్మిక్కులు
* ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య
విజయవాడ, మార్చి 22: వైఎస్ వివేకానందరెడ్డి హత్యను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేత జగన్ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తప్పుబట్టారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో సీఈసీ, హోం సెక్రటరీ వద్ద వివేక హత్య గురించి ఆయన కూతురు సునీతతో జగన్ అబద్ధాలు చెప్పించారన్నారు. అసలు గుట్టు బయటకు వస్తుందనే భయంతో డాక్టర్ సునీతను బెదిరించి ఆమె చేత అసత్య ప్రకటనలు చేయించారన్నారు. వివేకా కుమార్తె తొలుత సిట్‌పై తనకు నమ్మకం ఉందని, ఈ హత్యను రాజకీయం చేయవద్దని మాట్లాడిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు. హత్య కేసుపై దర్యాప్తు జరుపుతుంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. జగన్ రాజకీయాల కోసం సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో పోలీసు ఇన్స్‌పెక్టర్ బలయ్యారని ఆరోపించారు. వివేక హత్య కేసులో నిందితులెవరో జగనకు తెలుసని, కావాలనే నిజాలు దాస్తున్నారని, జగన్ ఇప్పటికైనా తన బాబాయి హత్య గురించి వాస్తవాలు బయటపెట్టాలని రామయ్య డిమాండ్ చేశారు.

జగన్‌తోనే రాజన్న రాజ్యం
* ఇంటింటికీ వెళ్లి ఆత్మీయంగా పలకరించిన మల్లాది
పాయకాపురం, మార్చి 22: రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న పార్టీకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గ వైసిపి అభ్యర్ధి మల్లాది విష్ణువర్ధన్ కోరారు. స్థానిక 55వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో ఆయన శుక్రవారం ఉదయం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసిపికే ఓటు వేయాలని అభ్యర్ధించారు. మల్లాది వెనుక భారీగా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ వైసిపి ప్రజల పార్టీ అని, మాట తప్పని మడమ తిప్పని మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్న జగనన్నతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. వైసిపి జెండా పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నవరత్నాలు రూపొందించామని, అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అవినీతి, అసమర్ద తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు, పలు పార్టీల నేతలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఐదేళ్ళలో ఏ ఒక్క హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లేసి చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే విధంగా 45వ డివిజన్‌లో సైతం మల్లాది విష్ణు సమక్షంలో బోనం నాగు, శ్రీనివాసరావు, బీ విజయ్‌కుమార్, వీరయ్య ఆధ్వర్యంలో పలువురు స్వచ్ఛంధంగా పార్టీలో చేరారు.

నున్నలో పోలీసుల కవాతు
పాయకాపురం, మార్చి 22: ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశ్యంతో నున్న గ్రామీణ పోలీసులు శుక్రవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. నున్న సిఐ ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎస్సై కట్టా నాగేశ్వరరావు, ఏస్సై జి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, పిఎస్సై హైమావతి ఇతర సిబ్బంది, ఒక కంపెనీ ఆర్‌పిఎస్‌ఎఫ్ సిబ్బంది కలిసి ఎన్నికల సందర్భంగా పాతపాడు, నున్న గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకరరావు మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని శాంతియుత వాతావరణం ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని కోరారు. ఎవరైనా పార్టీల పరంగా గొడవలకు పాల్పడినా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

జలవనరుల వినియోగంపై
ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరగాలి
పాయకాపురం, మార్చి 22: భవిష్యత్తులో జల సంబంధమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా జల సంరక్షణ కార్యక్రమాలు అమలు పరిచేందుకు ప్రణాళికలు రూపొందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించేందుకు జలవనరుల అధికారులు కృషి చేయాలని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కె.వెంకటేశ్వరరావు కోరారు. 27వ ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో జల సంబంధమైన సమస్యలను అధిగమించేందుకు జలవనరుల శాఖ అధికారులు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఖఱీఫ్, రబీ సీజన్‌లో రైతాంగానికి అవసరమైన సాగునీటిని సంరక్షించుకుని ప్రజల అవసరాలకు అవసరమైయ్యే రీతిలో ఉపయోగించుకున్నప్పుడే సత్ఫలితాలను పొందగలుగుతామన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ‘అందరికీ రక్షిత మంచినీరు’ అనే నినాదంతో జలవనరుల దినోత్సవాన్ని జరుపుకోవడం ముదావాహం అన్నారు. ప్రభుత్వం జలవనరుల శాఖ ద్వారా తాగు, సాగునీరు సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఆయా కార్యక్రమాల్లో అధికారులు పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు జలసంరక్షణలో భాగస్వాములయ్యే విధంగా ప్రతిజ్ఞ చేయించారు.

పార్లమెంటు నియోజకవర్గానికి
ఆరుగురి నామినేషన్
పాయకాపురం, మార్చి 22: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏప్రిల్ 11న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం ఆరుగురు అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేసినట్లు కృతికాశుక్లా తెలిపారు. వీరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా కేశినేనినాని రెండు సెట్లు, కేశినేని పావని ఒక సెట్టు, వైసిపి అభ్యర్ధిగా పొట్లూరి వరప్రసాద్ ఒక సెట్టు, భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా కిలారు దిలీప్ రెండు సెట్లు, ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా బొలిశెట్టి హరిబాబు, ధనేకుల గాంధీ ఒక్కోసెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు తెలిపారు.

నేడు నగరానికి పవన్‌కళ్యాణ్
* బహిరంగ సభల్లో జనసేనాని
పాయకాపురం, మార్చి 22: నేడు నగరానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నారు. ఎన్నికల ప్రచార నేపధ్యంలో మధ్యాహ్నం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పైపులరోడ్డు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్ధి చిగురుపాటి బాబూరావుకు మద్దతు తెలుపుతూ ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే పోత్తుల్లో భాగంగా సెంట్రల్ సీటు సిపిఎంకు దక్కిన విషయం విధితమే. ఇక్కడి బహిరంగ సభ అనంతరం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధి పోతిన వెంకట మహేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ కొత్తపేట కోమలా విలాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుండి తూర్పు నియోజకవర్గ అభ్యర్ధి బత్తిన రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ జరిగే బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ పాల్గొనున్నారు.

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం
పటమట, మార్చి 22: రాష్ట్రంలో తె లుగుదేశం పార్టీ అధికారంలోకి రావ డం ఖాయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శుక్రవారం 10వ డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫారుఖ్‌నగర్, చెక్‌పోస్ట్ సెంటర్, మసీదు ప్రాంతాలలో ప్రచా రం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మనందరం టీడీపీ కి అండగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నజీర్ హుస్సేన్, నసీర్ అహ్మద్, ఎండీ ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ మద్దతు కోరిన గద్దె
అసెంబ్లీ ఎన్నికలలో తనను గెలపించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అ న్నారు. శుక్రవారం ఉదయం బందర్ రోడ్డులోని రేడియో స్టేషన్, స్టేట్ గెస్ట్‌హౌస్ తదితర ప్రాంతాలలో పర్యటిం చి తనకు మద్దతు ఇవ్వాలని వాకర్స్ స భ్యులను ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ చంద్రబా బు అధికారంలోకి వస్తే అభివృద్ధి సా ధ్యమన్నారు. ఓటు హక్కును అంద రూ సద్వినియోగం చేసుకోవాలని కో రారు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే మ న బిడ్డల భవిష్యత్ బాగుంటుందని చె ప్పారు. వైకాపా నాయకులు రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో జరిగిన అ భివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. ఎంపీగా కేశినేనిని, అసెంబ్లీ అ భ్యర్థిగా తనను ఆశీర్వదించాలన్నారు.

ఓపెన్ ఫోరంలో
7 దరఖాస్తులకు అనుమతులు
ఇంద్రకీలాద్రి, మార్చి 22: ఏపీసీఆర్‌డీఏ ఓపెన్ ఫోరమ్‌లో 7 దరఖాస్తులను అనుమతి మంజూరు చేశారు. ఏ పీసీఆర్‌డీ కార్యాలయంలో శుక్రవా రం ఉదయం నిర్వహించిన ఓపెన్ ఫో రంలో మొత్తం 8 దరఖాస్తులు వచ్చా యి. వీటిలో నిబంధనలకు అనుగుణంగా 7 దరఖాస్తులను అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈకార్యక్రమంలో ప్లానింగ్ విభాగం డైరెక్టర్ జీ నాగేశ్వరరావు, జోనల్ జాయింట్ డైరెక్టర్ కే ధనుంజనేయరెడ్డి పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు
విజయవాడ (క్రైం), మార్చి 22: తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ తెలపాలని నగర పోలీసు శాఖ ప్రకటన చేసింది. వడోదరాకు చెందిన అపూర్వ శర్మ (26) అనే వ్యక్తి మార్చి 11నుంచి కనిపించ డం లేదు. దీంతో వాఘోడియా రూర ల్ పోలీస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 11న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వడోదర నుంచి విజయవాడకు వచ్చే రైలు ఎక్కి 12న రైల్వేస్టేషన్‌లో దిగినట్లు సీసీ టివి పుటేజీలో పోలీసులు గుర్తించారు. దీంతో తప్పిపోయిన వ్యక్తి సమాచారం కోసం గుజరాత్ పోలీసులు నగర పోలీసుల సహకారం కోరుతూ సంప్రదించారు. అదృశ్యమైన వ్యక్తి గురించిన సమాచారం తె లిసిన వారు తమకు తెలియచేయాల్సిందిగా నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.