విజయవాడ

నిరంతరం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 23: సాధారణ ఎన్నికల సన్నాహాలపై పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు పోలీసు అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు, ప్రజలు తమ ఓటుహక్కు నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పోలీసు కమాండ్ కంట్రోల్‌లో జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలతో పాటు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు అమలు, పోలీస్టేషన్ల వారీగా ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి ముందుగానే కట్టడి చేయడం, అదేవిధంగా రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారి కదలికలు, పూర్తి వివరాలు, వారి జీవన విధానం తదితర అంశాల గూర్చి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన బైండోవర్ కేసులు, సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాల గూర్చి సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి పోలింగ్ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చేపట్టాల్సిన భద్రతా చర్యలు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీసీపీలు వెంకట అప్పలనాయుడు, వీ హర్షవర్థనరాజు, డీ కోటేశ్వరరావు, వై రవిశంకరరెడ్డి, ఉదయరాణి, అదనపు డీసీపీ నవాబ్ జానీ, పరువురు ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.