విజయవాడ

మంచినీటి అంసరాల కోసం కాలువలకు నేడు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: పట్టిసీమ పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువకు రెండురోజులుగా 1500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. నీటిమట్టం క్రమేణా పెరిగే అవకాశాలు కన్పిస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచినీటి కో సం సోమవారం ఉదయం ఆరు గంటలకు తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. గోదావరి జలాలు వచ్చేస్తున్నాయి ఇక వరినాట్లు వేసుకోవచ్చని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలోనే ప్రకటించారు. అయితే ఆయకట్టు చివరి కలిదిండి, కైకలూరు, కృత్తివెన్ను మండలాల పరిధిలో మం చినీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయబోతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు ఎప్పుడు వేసుకోవాలో తెలియని అనిశ్చితి పరిస్థితి నెలకొంది.