విశాఖపట్నం

పోలీసులు సీజ్ చేసిన డబ్బంతా అభ్యర్థులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: డబ్బులకు లొంగిపోయి ఓట్లు వేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్‌లో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా సుమారు రూ. 1000 కోట్లు సీజ్ చేశారని, ఈ మొత్తం డబ్బు అభ్యర్థులకు చెందినదే అయినప్పటికీ ఏ ఒక్కరిపైనా అనర్హత వేటు ఎందుకు వేయలేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆయన ప్రశ్నించారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడంలేదని, డబ్బుకి, డబ్బుకి మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో డబ్బులు, మద్యం పంపిణీ కాని నియోజకవర్గం ఒక్కటి కూడా లేదన్నారు. ధనస్వామ్య రాజకీయాలకు సీఈసీ లొంగిపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికల నియమావళి పేరుతో వాహనాల తనిఖీలు చేస్తూ ఎంతో గొప్పగా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్న ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తుంటే నిర్లిప్తంగా వ్యవహరించడం దారుణమన్నారు.
విశాఖలో ఓటర్లకు డబ్బులు, నాయకులకు ఉంగరాలు
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు, నాయకులకు బంగారు ఉంగరాల పంపిణీ జరిగిందని రామకృష్ణ తెలిపారు. ఇక గాజువాక నియోజకవర్గంలో పోటీలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎలాగైనా సరే ఓడించాలనే ధ్యేయంతో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ విపరీతంగా డబ్బులను పంపిణీ చేస్తున్నాయన్నారు. మంగళగిరిలో సీఎం తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నందున ఓటుకు రూ. 10వేలు ముట్టచెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇక్కడ ఏసీ మిషన్లు పంపిణీ చేస్తుంటే పోలీసులు పట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 20 నుంచి రూ. 40 కోట్లు, మరి కొన్ని చోట్ల రూ. 100కోట్లు కూడా ఖర్చు చేస్తున్నారంటే ప్రజస్వామ్యానికి విలువెక్కడ ఉందన్నారు.