కృష్ణ

గర్భం పేరిట భర్తను నమ్మించి...బిడ్డను కొనుక్కొంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 21: అంతకు ముందు విఫలమైన రెండు పెళ్ళిళ్ళు.. ఇకనైనా.. మూడో భర్తనైనా దక్కించుకునే ఆలోచనతోనే అతనితో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు నమ్మించి.. ఆపై ఏమార్చేందుకు నాగమలేశ్వరి ఇంతటి సాహసానికి ఒడిగట్టింది. మగశిశువుకు తల్లి అనిపించునేందుకు మరో కన్నపేగుకు శోకాన్ని కలిగించేందుకు కూడా వెనుకాడలేదు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు తల్లి అయిన నాగమల్లేశ్వరి ఈసారి మగబిడ్డను కోరుకున్నా.. తనకు బిడ్డ పుట్టే అవకాశం లేనందున ప్రభుత్వాస్పత్రిలో శిశువు కిడ్నాప్‌కు పాల్పడింది. అంతకుముందు చెన్నై ఆస్పత్రిలో కూడా పురిటి బిడ్డ కోసం విఫలయత్నం చేసింది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగే బావుండు అనుకున్న ఆమె ఆశలు అడియాశలై కటకటాలపాలైంది. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరీ (27) పేద కుటుంబంలో పుట్టి పదో తరగతి వరకు చదువుకుంది. బావ వీరబాబును వివాహమాడి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మొదటి భర్తతో తెగతెంపులైన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన ఆమె అక్కడ పరిచయమైన రాకేష్‌తో నాలుగేళ్ళు కలిసి ఉంది. రాకేష్ మరో యువతిని పెళ్లాడగా.. అతనితోనూ సంబంధం తెంచుకుని స్వగ్రామానికి వచ్చేసి టైలరింగ్ చేసుకుంటూ ఆడపిల్లలను పోషిస్తున్న క్రమంలో ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మద్దా జ్యోతి స్వర్జన రాజు (29)తో పరిచయమై పెళ్లి చేసుకుంది. అవివాహితుడైన స్వర్జనరాజు ఆమెను బాగా చూసుకోవడంతో అతనిపై ఆశలు పెంచుకుంది. అయితే అప్పటికే తనకు రెండు పెళ్లిల్లు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న విషయం భర్త వద్ద గోప్యంగా ఉంచుతూ వస్తోంది. అయితే నాగమల్లేశ్వరీకి అంతకుముందే ఆపరేషన్ కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదు. దీంతో భర్త తనను వదిలేస్తాడేమోనని భావించి తాను గర్భం దాల్చినట్లు నమ్మించింది. అయితే నెలలు దగ్గరపడుతుండగా.. భర్తకు అనుమానం రాకుండా తాను బాత్‌రూములో జారి పడిపోయానని, దీంతో గర్భం కిందకు జారిందని నమ్మించి.. కాన్పు కోసం చెన్నైలోని బంధువుల వద్దకు వెళ్తున్నట్లు ఏమార్చింది. ఈక్రమంలో ఈనెల 11వ తేదీన చెన్నై వెళ్లింది. అప్పటికే రోజుల పురిటి బిడ్డ కోసం అనే్వషణలో ఉన్న నాగమల్లేశ్వరీ చెన్నై ఆస్పత్రిలో విఫలయత్నం చేసింది. అక్కడి రైల్వేస్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టిన ఓ మొబైల్‌ను అపహరించి 13వ తేదీ సాయంత్రం అక్కడి నుంచి విజయవాడ రైల్లేస్టేషన్‌కు చేరుకుంది. నేరుగా ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఇక్కడ పని చేస్తున్న రికార్డు అసిస్టెంట్ శ్రీను (51)ను పరిచయం చేసుకుని మగశిశువు కావాలని అడిగింది. ఆస్పత్రిలోని సెక్యూరిటీ సిబ్బంది ముఖర్జి, కన్నయ్యల సహకారంతో 14వ తేదీన ఇంకుబ్యేటర్‌లో ఉన్న కళ్యాణి, సుబ్రహ్మణ్యం దంపతుల ఐదురోజుల పసికందుపై కనే్నసింది. స్వయంగా నాగమల్లేశ్వరి ఇంకుబ్యేటర్‌లోని బిడ్డను అపహరించి నేరుగా ఆస్పత్రి బయటకు వెళ్లి ఆటో ఎక్కి రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి గుంటూరు, తెనాలి చేరుకుని అక్కడ అప్పటికే వేచియున్న భర్తతో కలిసి అవనిగడ్డ ఇంటికి చేరుకుంది. చెన్నైలో కాన్పుకు వెళ్లి తిరిగి వచ్చినట్లు భర్తను ఏమార్చింది. తనకు మగబిడ్డ పుట్టాడని సంబరపడిపోయిన భర్త స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చాడు. చుట్టుపక్కల వారు నాగమల్లేశ్వరీకి హారతి పలికి దిష్టి తీశారు కూడా.
* ఆస్పత్రిలో చికిత్స చేయించి..
ఇదిలావుండగా.. నాగమల్లేశ్వరీ ప్రభుత్వాస్పత్రిలో బిడ్డను అపహరించే సమయానికి పసికందు కామెర్లతో ఉన్నాడు. కిడ్నాప్ అయిన తర్వాత జబ్బు ఎక్కువ కావడంతో నాగమల్లేశ్వరీ అవనిగడ్డలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు కూడా చేయించింది. ఈలోగా దర్యాప్తు బృందాలు ప్రజల సహకారంతో ఆమె ఆచూకీ కనుగొని అప్పటికే విషమ పరిస్ధితిలో ఉన్న పసికందును తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో శిశువు కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. నిందితులు కటకటాలపాలయ్యారు.

ఆంధ్రభూమి బ్యూరో