విజయవాడ

మరో మూడు మోడల్ పోలీస్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 20: నగర పోలీసు కమిషనరేట్‌లో మరో మూడు నూతన మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇప్పటికే ఐదు మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా.. మరో మూడు కొత్త మోడల్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం 10కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇందుకుగాను పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఓ ప్రణాళిక ప్రకారం మరో మూడు కొత్త మోడల్ పీఎస్‌లను సాధించుకోవడంలో ఆయన చేసిన కృషి ఫలించింది. కాలంచెల్లిన పోలీస్ స్టేషన్ భవనాల స్థానంలో ఆధునిక స్టేషన్ల నిర్మాణానికి పోలీసు శాఖ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలోభాగంగా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే కృష్ణలంక, భవానీపురం, ఉయ్యూరు రూరల్, సత్యనారాయణపురం, ఆత్కూరు మోడల్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా స్టేషన్ల స్థానంలో అన్ని హంగులతో నిర్మితమవుతున్న భవనాలకు సంబంధించి ఇప్పటికే నిర్మాణాలు శరవేగంతో సాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వౌలిక సదుపాయాలు, వినూత్న రీతిలో ప్రశాంత, స్నేహపూర్వక వాతావరణంలో నెలకొల్పేలా ఐదు మోడల్ స్టేషన్ల నిర్మాణాలు త్వరలో పూర్తికానున్నాయి. ఈక్రమంలోనే కమిషనరేట్‌లో మరో మూడు మోడల్ స్టేషన్ల నిర్మాణాలకు ప్రభుత్వం పోలీసు శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కావాల్సిన 10కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసింది. వీటిలో మాచవరం, కంకిపాడు, ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్లను మోడల్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు సీపీ ద్వారకాతిరుమలరావు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన 10కోట్లలో మాచవరం మోడల్ స్టేషన్‌కు రూ. 4.5కోట్లు, కంకిపాడు మోడల్ స్టేషన్‌కు 2.75 కోట్లు, ఉయ్యూరు టౌన్ మోడల్ స్టేషన్ భవనం నిర్మాణానికి 2.75 కోట్లు కేటాయించారు. జి ప్లస్ త్రీ పద్ధతిలో ఈ మూడు మోడల్ పోలీస్టేషన్ల భవనాల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. మాచవరం మోడల్ పోలీస్టేషన్ భవనంలో సెంట్రల్ ఏసీపీ కార్యాలయంతో పాటు శాంతిభద్రతలు, నేర, ట్రాఫిక్ విభాగాల పోలీస్టేషన్లు అన్నీ ఒకే భవనంలో ఉండేలా రూపకల్పన చేశారు. దీన్ని ప్రస్తుతమున్న స్థానంలో కాకుండా గుణదల విద్యుత్ సౌధ ప్రాంగణంలో నిర్మించనున్నారు.