విజయవాడ

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని చెన్నై వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. చెన్నై బయలుదేరి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం ఆత్కూరులోని స్వర్ణ్భారతి ట్రస్ట్ నుండి బయలుదేరి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాగూర్, జీఏడీ అదనపు సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, సీపీ ద్వారకాతిరుమలరావు, ప్రొటోకాల్ డైరెక్టర్ అశోక్‌బాబు, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్‌రావు, తదితరులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఉప రాష్ట్రపతి చెన్నై బయలుదేరి వెళ్లారు.